Home > Editorial > రికార్డులతో హోరెత్తిస్తున్న ఇస్రో

రికార్డులతో హోరెత్తిస్తున్న ఇస్రో

జీఎస్టీ కోసం వడివడిగా అడుగులు
పూర్తిగా నిలిచిపోయిన కిరోసిన్, పంచదార

isro-latest-apduniaఅంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరి త్రను సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత బరువైన జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి 1 రాకెట్ ను శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుండి ఇస్రో విజయవంతంగా రోదసిలో కి పంపింది. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1/జిశాట్-19 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. జిశాట్-19ని మోసుకెళ్లే జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 రాకెట్ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ కేంద్రం నుండి సాయంత్రం 5.28 గంటలకు ప్రయోగించామని ఆయన చెప్పారు. క్రయోజెనిక్ ఇంజిన్‌తో కూడిన ఈ వాహకనౌక ప్రయోగించిన 16 నిమిషాల్లోనే జిశాట్-19 ఉపగ్రహా న్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ రాకెట్‌కు ఉద్దేశించిన కౌంట్‌డౌన్ ఆదివారం మధ్యాహ్నం 3.58 గంటలకు ప్రారంభమయింది. 25 గంటల 30 నిమిషాల సుదీర్ఘ కౌంట్‌డౌన్ తర్వాత ఇది అంతరిక్షంలోకి నిప్పులు చిమ్ముతూ దూసు కెళ్లింది.640 టన్నుల బరువు, 43.43 మీటర్ల పొడ వున్న ఈ రాకెట్‌కు సుమారు 4 వేల కేజీల పేలోడ్‌ను జియోసింక్రనస్ ట్రాన్సఫర్ ఆర్బిట్ లోకి, మరో 1000 కేజీల లోడ్‌నులో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టే సామర్థముంది. ఈ మిషన్ విజయ వంతమవడం వల్ల భారత్ ఇకపై నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్‌ల ప్రయోగాలకు భారీ మొత్తాల ను చెల్లించి విదేశీ రాకెట్లపై ఆధారపడనక్కర్లేదు. తనే సొంతంగా ప్రయోగించుకోనుంది. ఈ రాకెట్‌లో ఉప యోగించిన అతిపెద్ద క్రయోజెనిక్ ఇంజిన్‌ని ఇస్రో శాస్త్రవేత్తలే తయారు చేశారు. పదేళ్ల పాటు సేవలందించనున్న జిశాట్-19 ఒక బహుళ పుంజ శాటిలైట్.మార్క్-3 రాకెట్ ద్వారా జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.ఈ ప్రయోగంతో బరువైన ఉపగ్రహాలను ప్రయోగించిన అగ్రదేశాల సరసన భారత్ నిలిచింది. 3,136 కిలోల బరువుగల జీశాట్‌-19 కమ్యూనికేషన్ శాటిలైట్‌తో నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ మార్క్-3.. నిర్ణీత 16.2 నిమిషాల్లో శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ ద్వారా అధునాత సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇంటర్నెట్ స్పీడు నాలుగు రెట్లు పెరగనుంది.‘ఫ్యాట్ బాయ్’గా పిలుస్తున్న ఈ జీశాట్-19 బరువు 200 ఏనుగుల కంటే ఎక్కువే. ఈ శాటిలైట్ తయారీకి ఇస్రో 12 ఏళ్లు కష్టపడింది. ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్‌-19 శాటిలైట్ రాకెట్‌ నుంచి విడిపోనుంది. ఇది జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి 4వేల కిలోలను, లో ఎర్త్ ఆర్బిట్లోకి 10వేల కిలోలను మోసుకెళ్లింది

జీశాట్‌-19 ఉపగ్రహంలో కేఏ బ్యాండ్, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. దీని ద్వారా ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో హైస్పీడు ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తాయి. 4జీ టెక్నాలజీ మరింత మెరుగుపడుతుంది. ఈ జీశాట్‌-19 ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యంత బరువువైన ఉపగ్రహాలను భారత్ నుంచే కక్ష్యలోకి పంపే సత్తా ఇస్రో సొంతమవుతుంది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్ కేంద్రంలో శాస్త్రవేత్తల సంబరాలు నింగినంటాయి. జి -శాట్ 19 ఉపగ్రహంతో సమాచార సేవలు విశేషంగా మెరుగవుతాయి. ఇంటర్‌నెట్ ప్రసార వేగం పుంజుకుంటుంది. జిఎల్‌ఎల్‌వి – మార్క్ 3 ప్రయోగ విజయంతో అత్యంత భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి అన్యుల రాకెట్లపై ఆధారపడవలసిన అవసరం తొలగిపోయింది. ఇంతవరకు ఇందుకోసం ఏరియన్ రాకెట్లపై ఆధారపడవలసి వచ్చేది. భారీ ఖర్చు భరించవలసి ఉండేది.

బయటి బలమైన శక్తుల నుంచి ఆంక్షలు, అభ్యంతరాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు స్వశక్తిని పుంజుకోవాలన్న తపన, పట్టుదల పెరుగుతాయి. అవి అంతిమంగా ఆ బలాఢ్యుల సరసనే చేరుస్తాయి. వాటికి దీటుగా నిలబెడుతాయి. చెప్పనలవికానంత ఆత్మతృప్తిని కలిగిస్తాయి. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. జిఎస్‌ఎల్‌వి – మార్క్ 3 ప్రయోగ సాఫల్యం ద్వారా భారత్ అటువంటి మహత్తర స్థాయిని అందుకున్నది. ఇందుకు ఇస్రో శాస్త్రజ్ఞులను ఎంతైనా అభినందించవలసి ఉన్నది. సుదీర్ఘమైన, ప్రయాసతో కూడిన కృషి ద్వారా ఈ రంగంలో మన పరాధీనస్థితిని రూపుమాపినందుకు వారు అత్యంత ప్రశంసనీయులు.స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం దేశం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇది చారిత్రక విజయంగా ఆయన అభివ ర్ణించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘భారీ శాటి లైట్లను మోసుకెళ్లగలిగే విధంగా భారత్ తయారు చేసిన బాహుబలి రాకెట్ జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 ప్రయోగం విజయవంతమవడం దేశం గర్విం చదగ్గ విషయం’ అని ఇస్రో ఎఎస్ కిరణ్ కుమార్‌కి రాష్ట్రపతి ఒక సందేశం పంపారు. భారీ రాకెట్ విజయంతో తదుపరి తరం ఉపగ్రహ సామర్థానికి భారత్ మరింత చేరువయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మిషన్ విజయ వంతమవడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది జాతి గర్వించదగ్గ మరో గొప్ప విజయమని ఆమె పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో అద్భుత ప్రదర్శన సంప్రదాయాన్ని నిలిపిందని ప్రశంసించారు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *