Home > Editorial > పరిష్కార దిశలో రేషన్ డీలర్ల సమస్యలు

పరిష్కార దిశలో రేషన్ డీలర్ల సమస్యలు

నితీశ్ పిల్లిమొగ్గలు ...
గల్ఫ్ కష్టాలు

cv anand_apduniaరేషన్ డీలర్ల సమస్యలు పరిష్కార దిశలో ఉన్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ సి.వి. ఆనంద్ అన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంపుతో పాటు వారి ఆదాయ మార్గాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే ఆ దిశగా పలు నిర్ణయాలు తీసుకుందని, ఈ పరిస్థితిలో మంచి వాతావరణాన్ని చేజేతులా చెడగొట్టుకోవద్దని డీలర్లకు విజ్ఞప్తి చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సమ్మెకు వెళితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాము ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాల్సి ఉంటుందన్నారు. వచ్చె నెల ఒకటవ తేదీ నుండి రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో గత రెండు రోజులుగా (మంగళవారం, బుధవారం) వారితో కమిషనర్ చర్చలు జరిపారు. మంగళవారం పౌరసరఫరాలభవన్లో బత్తుల రమేష్, మల్లేశం, వెంకటరమణ ఆధ్వర్యంలోని యూనియన్లతో చర్చలు జరిపిన కమిషనర్గారు, బుధవారంనాడు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం (నాయికోటి రాజు) ఆధ్వర్యంలోని యూనియన్తో కూడా చర్చలు జరిపారు.  అలాగే అన్ని జిల్లాల డిసిఎస్వోలతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై క్షుణ్ణంగా చర్చించారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కర విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, తొందరపడి సమ్మెకు వెళితే డీలర్లే నష్టపోతారని, ఇదే విషయాన్ని జిల్లా, మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి వారికి స్పష్టం చేయాలని డిసిఎస్వోలకు సూచించారు. ”రేషన్ డీలర్ల ఆదాయం పెరిగేలా రేషన్ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించాం. ఇందులో భాగంగా నగదు రహిత లావాదేవీలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో ఈపాస్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఒకటి రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తవుతుంది. భవిష్యత్తులో రేషన్షాపులు మినీ బ్యాంకులుగా మారనున్నాయి. దీని ద్వారా రేషన్ డీలర్ల ఆదారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆధార్ ద్వారా చేసే లావాలేదీలు అన్ని రేషన్ షాపు ద్వారా నిర్వహించుకునేలా ఈపాస్ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నాం. రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఉంది. డీలర్ల కమిషన్ పెంపు, గౌరవ వేతనం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారు దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు ఓపిక వహించి ప్రభుత్వానికి సహకరించండి” అని అన్నారు. గోదాముల నుండే తూకంలో తేడా వస్తుందనే విషయాన్ని ఇప్పటికే గుర్తించాం. దానిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 171 గోదాముల్లో వెయింగ్ బ్రిడ్జిలను ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తం స్టాకులో 1.5 శాతం తేడా (వెరియేషన్)కు అనుమతికి స్పష్టమైన ఆదేశాలను ఒకటి రెండు రోజుల్లో జారీచేస్తాం. విజిలెన్స్ అధికారులు ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *