Home > World News > భాగ్యనగర్ ను గుర్తు చేసుకుంటున్న ఇవాంక

భాగ్యనగర్ ను గుర్తు చేసుకుంటున్న ఇవాంక

ప్రవాసీయుల్లో భారతీయులే టాప్
ట్రంప్ పై మండిపడుతున్న ముస్లిమ్ దేశాలు

ivanka-trump-adpuniaభాగ్యనగరంలో ఉంది రెండు రోజులే. కానీ మర్చిపోలేక పోతుందామె. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటోది. హైదరాబాద్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆతిధ్యం, ప్రజల జీవన విధానం, గోల్కొండ కోట పరిసరాలను చూసి మురిసిపోయింది. ఆమెనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక. ఈ స‌ద‌స్సును స్మ‌రించుకుంటూ తాజాగా మరో ట్వీట్‌ చేసిమందామె. జీ.ఈ.ఎస్‌-2017లో పాలుపంచుకునే అవ‌కాశం ద‌క్కినందుకు గ‌ర్వంగా ఉంది. ఈ స‌ద‌స్సులో పాలుపంచుకోవ‌డాన్ని గౌర‌వంగా చూస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా 1200 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు వచ్చారు. అందులో 350 మంది అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వివిధ దేశాల నుంచి అతిధులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన భారత ప్రజలకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అని ఆమె ట్విట్టర్‌ లో ప్రస్తావించారు. చివ‌ర‌గా త‌న ట్వీట్‌కు ‘ధన్యవాద్‌’ అని ప్రత్యేకంగా హిందీపదం చేర్చి హైద‌రాబాదు జ్ఞ‌ాప‌కాల‌ను నెమరు వేసుకున్నారు. అంతగా ఆమెను ఇక్కడివారు ఆకట్టుకున్నారని అర్థమవుతోంది. అమెరికా అధ్యక్షుడు సలహాదారు కావడంతో కాస్తంత ఎక్కువగానే ఆమెకు గౌరవ, మర్యాదలు అందాయి. అందుకే మర్చిపోలేక పోతున్నారామె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com