Home > Movies > కామ సూత్ర అంటూ ముందుకొస్తున్న జుడ్వా 2

కామ సూత్ర అంటూ ముందుకొస్తున్న జుడ్వా 2

మరో రికార్డ్ క్రియేట్ చేస్తున్న పవన్
దిల్ రాజు కు సక్సెస్ ఇయర్ గా 2017

jacqueline-fernandez-apduniaజుడ్వా 2’ మూవీతో సక్సెస్‌తో అందుకున్న శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ అందాల నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. శ్రీలంకలో ‘కామసూత్ర’ పేరుతో చైన్ హోటల్స్ బిజినెస్‌‌కు రిబ్బన్ కటింగ్ చేసేసింది. అయితే భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ఇచ్చట అన్ని రుచులు లభించును అంటూ తన హోటల్‌కు ‘కామసూత్ర’ పేరు పెట్టేసింది ఈ హాట్ సుందరి. తన కొత్త బిజినెస్‌కు ‘కామసూత్ర’ పేరును ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేయండంతో అమ్మడు కొత్త బిజినెస్ నేమ్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.సినీ తారలు వ్యాపార రంగంలో అడుగు పెట్టడం మాములు విషయమే. ఇప్పుడు చాలా మంది అదే పని చేస్తున్నారు. కొందరు చేయి కాల్చుకుంటున్నారు. మరికొందరు విజయవంతంగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. హోటల్ రంగం వైపు ఎక్కువగా అడుగుపెట్టే వారు చాలా మందినే. బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఇప్పుడు అదే పని చేసింది. శ్రీలంకలో చైన్ హోటల్ బిజినెస్‌ను మొదలు పెట్టింది. ఈ అమ్మడు హోటల్ పెట్టడం వరకు బాగానే ఉంది. అయితే ఆమె పెట్టిన హోటల్ పేరే హాట్ టాపికైంది. ఆ హోటల్ పేరు ‘కామసూత్ర’ అని పెట్టేసింది. వాటమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా.. హోటల్‌కి ఆ పేరేంటమ్మా అని అంతా అనుకుంటున్నారు. హోటల్ పూర్తిగా ప్రారంభం కాకముందే ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంటోంది ఫెర్నాండేజ్. అందరి దృష్టినీ ఆకర్షించాలనే ఆలోచనతోనే ఈపేరు పెట్టానంటోంది జాక్వలిన్. శ్రీలంకకు చెందిన ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా బాగానే రాణించింది. రిపోర్టర్ జీవితం ప్రారంభించిన ఆమె చివరకు హోటల్ రంగంలో స్థిరపడాలని ఆలోచిస్తోంది. 2006 శ్రీలంక దేశం తరపున మిస్ యూనివర్స్ గాను ఎన్నికైంది. మర్టర్2, రేసు, హవుస్ పుల్ వంటి సినిమాలతో హిట్ కొట్టింది. కామసూత్ర’ బిజినెస్ త్వరలో ఇండియాలో కూడా విస్తరిస్తాం అంటుంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో తనకు ఉన్న ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు జాక్వలిన్ ఖతర్నాక్ ప్లాన్ చేసిందంటున్నారు బాలీవుడ్ జనాలు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మూవీ మేకర్స్ షూటింగ్ స్పాట్‌లుగా శ్రీలంకను ఎక్కువ ప్రిఫర్ చేస్తుండటంతో ‘కామసూత్ర హోటల్’‌కి తప్పక వస్తారని భావిస్తుందట జాక్వలిన్ ఫెర్నాండేజ్.మొత్తానికి ఒక వైపు సినిమాలు మరోవైపు కొత్త బిజినెస్‌తో బిజీ హీరోయిన్‌గా మారింది జాక్వలిన్ ఫెర్నాండేజ్. ప్రస్తుతం ఈమె సల్మాన్ ఖాన్ సరసన రేస్ 3 చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com