Home > Sports > మూడో టెస్ట్ కు జడేజా దూరం

మూడో టెస్ట్ కు జడేజా దూరం

మూడో టెస్ట్ కు ప్రయోగాలు
మిధాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారు

India's Wriddhiman Saha raises his bat and helmet to celebrate scoring a hundred during the fourth day of their third test cricket match against Australia in Ranchi, India, Sunday, March 19, 2017. (AP Photo/Aijaz Rahi)

శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాపై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఫీల్డింగ్ సమయంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కి హాని కలిగించే రీతిలో బంతిని విసిరినందుకు అతనిపై మ్యాచ్ రిఫరీ క్రమశిక్షణ చర్యల కింద మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చాడు.ఇప్పటికే మూడు డీమెరిట్ పాయింట్లతో ఉన్న జడేజా ఖాతాలో ఈ పాయింట్లు చేరడంతో అతడు ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. దీంతో ఆగస్టు 12 నుంచి శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టుకి జడేజా దూరం కానున్నాడు. ఆటలో మూడోరోజైన శనివారం బంతిని అందుకున్న జడేజా.. బ్యాట్స్‌మెన్ కరుణరత్నెని గాయపరిచే రీతిలో బంతిని ప్రమాదకరంగా విసిరి తప్పు చేశాడు. గత ఏడాది న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా పిచ్‌పై నడిచిన జడేజా ఖాతాలో మ్యాచ్ రిఫరీ మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *