Home > Movies > ఎన్టీఆర్ బయోపిక్ లో జగపతిబాబు

ఎన్టీఆర్ బయోపిక్ లో జగపతిబాబు

మెర్సల్ కు అమెరికాలో ఫుల్ కలెక్షన్స్
ఎన్టీఆర్ బయోపిక్ లో పెద్ద పెద్ద హీరోలు
 
jagapati babuతేజ దర్శకత్వంలో రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. బాలయ్య అంతా తానై రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ తెలుగు తారలంతా కనిపించే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో అనేక రియల్ లైఫ్ క్యారెక్టర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రముఖుల పాత్రలను ప్రముఖ నటీనటులే పోషిస్తారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు నటీనటుల ఎంపిక జరుగుతోందని సమాచారం. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య చేయబోతున్నాడు.ఇక ఎన్టీఆర్ తనయుల పాత్రలు కూడా ఇందులో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో హరికృష్ణ‌ పాత్ర కూడా కీలకం అని.. ఆ పాత్రను కల్యాణ్ రామ్ చేయబోతున్నాడని సమాచారం. తండ్రి పాత్రను ఈ విధంగా ఈ తనయుడు చేయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్ర కూడా ఉంటుందని సమాచారం. దాన్ని చేయడానికి జగపతిబాబును ఎంచుకున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్ అల్లుడి పాత్రలో జగపతి కనిపించబోతున్నాడట. ఇక ఇందులో మిగతా పాత్రలకు నటీనటుల ఎంపిక జరగబోతోందని.. ఓవరాల్ గా ప్రముఖ తారాగణమంతా ఈ సినిమాలో కనిపించడం ఖాయమని తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఈ సినిమాలో ఏదో ఒక ముఖ్య పాత్రలో చూపించాలనేది తేజ ప్రణాళికగా తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *