Home > Politics > ‘జన్మభూమి’ రాష్ట్ర స్థాయి అవార్డులు

‘జన్మభూమి’ రాష్ట్ర స్థాయి అవార్డులు

బీజేపీకి వ్యతిరేకం కాదు : సీఎం చంద్రబాబు
మోత్కుపల్లి వ్యాఖ్యలు వ్యక్తిగతం : రావుల

VJA  JANMABHOOMI AWARDS  (2)ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన అయిదో విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర పోషించిన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేశారు. వారితో పాటు ఉత్తమ పంచాయతీలు, వార్డులు, మండలాలు, మున్సిపాల్టీలతో పాటు మహిళా స్వయం సంఘాలు, సాధికార మిత్రలకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాజాత బృందాల సభ్యులు కూడా సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 17 విభాగాల్లో 131 అవార్డులను సీఎం చంద్రబాబు అవార్డులు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన శాఖ/పథకాల విభాగంలో చంద్రన్నబీమా పథకాన్ని ప్రథమ బహుమతి రాగా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పించన్ల పథకం ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నయి. ఉత్తమ జిల్లాల విభాగంలో కృష్ణా, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు వరుసుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఆర్థిక సంబంధమైన వినతుల పరిష్కారంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా, కర్నూల్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాన్ ఫైనాన్సియల్ వినతుల పరిష్కారంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించాయి. ఉద్యోగుల విషయానికొస్తే…ఆర్థిక సంబంధమైన వినతుల పరిష్కారంలో విజయనగరం జిల్లాకు చెందిన హౌసింగ్ ఏఈ జి.వర్మరాజు ప్రథమ బహుమతి పొందగా, విశాఖపట్నం జిల్లాకు చెందిన హౌసింగ్ ఏఈ ఎస్.కె.ఎం.షా, రాజమండ్రి రూరల్ తహసీల్దారు కె.పోసియ్యా ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. నాన్ ఫైనాన్సియల్ కేటగిరిలో విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు మొదటి స్థానంలో నిలువగా, కృష్ణా జిల్లా గన్నవరం తహసీల్దారు ఎం.మాధురి, మొగల్లూరు తహసీల్దారు ఎస్.హరినాథ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఉత్తమ మండల కమిటీలు ఇవే…
జన్మభూమి-మా ఊరు కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన మండల కమిటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వాటికి సీఎం చంద్రబాబునాయుడు అవార్డులు ప్రదానం చేశారు. అనంతపురం జిల్లాకు సంబంధించి రామగిరి మండల కమిటీ ఉత్తమ కమిటీగా ఎంపికైంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి సోమాల, తూర్పు గోదావరి జిల్లాలో ఆలుమూరు, గుంటూరు జిల్లాలో నకిరికల్లు మండలాలు ఉత్తమ మండలాలుగా ఎంపికయ్యాయి. కృష్ణా జిల్లాలో బాపులపాడు, కర్నూల్ జిల్లాలో నంద్యాల, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, నెల్లూరు జిల్లాలో విడవలూరు మండలాల కమిటీలు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు, విశాఖపట్నానికి సంబంధించి ఎస్.రాయవరం, విజయనగరం జిల్లాలో బొండపల్లి మండల కమిటీలు ఉత్తమ ప్రతిభ చూపాయి. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టయ్యగూడెం, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి రామాపురం మండల కమిటీలు ఉత్తమ ప్రతిభ చూపి, సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి.

ఉత్తమ మున్సిపల్ కమిటీలు…
రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాల్లో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చూపిన మున్సిపల్ కమిటీలకూ సీఎం చంద్రబాబునాయుడు అవార్డులు అందజేశారు. అనంతపురం జిల్లాలో గుంటకల్లు, చిత్తూరు జిల్లాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు గోదావరిలో గొల్లప్రోలు, గుంటూరు జిల్లాలో సత్తెనేపల్లి, కృష్ణా జిల్లాలో విజయవాడ మున్సిపాల్టీ కమిటీలు ఉత్తమ కమిటీలు ఎంపికయ్యాయి. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, నెల్లూరు జిల్లాలో కావలి మున్సిపల్ కమిటీలు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం, విజయనగరంలో నెల్లిమర్ల, పశ్చిమ గోదావరిలో భీమవరం, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రగుంట్ల మున్సిపల్ కమిటీలు ఉత్తమ ప్రతిభ చూపాయి.

ఉత్తమ పంచాయతీ కమిటీలు…
రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీ కమిటీలుగా అనంతపురం జిల్లాకు చెందిన ఓబళదేవరచెరువు, చిత్తూరులో పాలసముద్రం, తూర్పు గోదావరిలో మామిడికుదురు, గుంటూరులో కొల్లూరు పంచాయతీలు ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. కృష్ణా జిల్లాలో రెడ్డిగూడెం, కర్నూలులో సంజామల, ప్రకాశం జిల్లాలో జరుగుమిల్లి, నెల్లూరులో దగదర్తి పంచాయతీలకు చెందిన కమిటీలు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లావేరు, విశాఖపట్నంలో నర్సీపట్నం, విజయనగరం జిల్లా బొండపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టయ్యగూడెం, కడప జిల్లాకు చెందిన వీరపనాయనిపల్లి మండల కమిటీలు ఉత్తమ కమిటీలుగా ఎంపికయ్యాయి.

ఉత్తమ వార్డు కమిటీలు…
పురపాలక సంఘాల్లో ఉన్న వార్డు కమిటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వాటికి సీఎం చంద్రబాబునాయుడు అవార్డులు అందజేశారు. అనంతరపురం జిల్లా హిందూపూర్ మున్సిపాల్టీకి చెందిన 38 వార్డు, చిత్తూరులో ఉన్న 50 వార్డు, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన 30 వార్డు కమిటీలు ఉత్తమ ప్రతిభ చూపాయి. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన 31వ వార్డు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న 27 వార్డు, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 42 వార్డు కమిటీలు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపూర్ కు చెందిన 32 వార్డు, నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన 25 వార్డు కమిటీలు ఉత్తమ ప్రతిభ చూపాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన 23 వార్డు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 72వ వార్డు, విజయనగరం మున్సిపాల్టీకి చెందిన 40 వార్డు, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 28 వార్డు, వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటకు చెందిన 20 వార్డు కమిటీలు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి.రాష్ట్ర స్థాయిలో రూరల్ పరిధిలో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళా స్వయం సహాయక సంఘాలకు కూడా సీఎం చంద్రబాబునాయుడు అవార్డులు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలానికి చెందిన రామ్ జీ గ్రూపు, విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన సంతోషిమాతా మహిలా పొదుపు సంఘం, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలానికి చెందిన శ్రీసూర్య గ్రూపు ఉత్తమ ప్రతిభ చూపాయి. తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలానికి చెందిన ఇందిరా మహిళా సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలానికి చెందిన మైనార్టీ మహిళా సంఘం, కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన ఉదయ్ మహిళా సంఘం, గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన సాయి ఆదర్శ మహిళా సంఘం సభ్యులు తరఫున ఆయా సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలానికి చెందిన ఝాన్సీలక్ష్మీభాయ్ మహిళా సంఘం, నెల్లూరు జిల్లా సంగ్రామ మండలానికి చెందిన ప్రియాంక మహిళా సంఘం, చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందిన రాజరాజేశ్వరి మహిళా సంఘం, కడప జిల్లా వెంపల్లే మండలానికి చెందిన గణపతి మహిళా స్వయం సహాయక సంఘం, అనంతపురం జిల్లా డి.హిరెహాల్ మండలానికి చెందిన శ్రీశక్తి మహిళా సంఘం, కర్నూల్ జిల్లా ఓరకల్లు మండలానికి చెందిన వెంకటేశ్వర మహిళా సంఘాలు ఉత్తమ మహిళా స్వయం సహాయక సంఘాలుగా ఎంపికయ్యాయి. మున్సిపాల్టీలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలకూ సీఎం చంద్రబాబునాయుడు అవార్డులు అందజేశారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు చెందిన మున్సిపాల్టీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘాన్ని ఎంపిక చేసి అవార్డు అందజేశారు. సాధికార మిత్రలకూ అవార్డులు ప్రదానం చేశారు. అయిదో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం సందర్భంగా ఉత్తమ ప్రదర్శన చేసిన కళాజాతా సభ్యులు కూడా అవార్డు అందుకున్నారు. ఒక్కో జిల్లా నుంచి ఉత్తమ ప్రదర్శనలు చేసిన కళాజాతాలకు రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేశారు. గ్రామీణ క్రీడలతో పాటు 5కె రన్ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆరుగురు అధికారులకు సీఎం చంద్రబాబునాయుడు అవార్డులు అందజేశారు. అలాగే, జన్మభూమి కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన 50 ఏళ్ల పైబడిన ముగ్గురు ఉద్యోగులు కూడా అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *