Home > World News > వెలుగులోకి జయలలిత మృతి

వెలుగులోకి జయలలిత మృతి

కులభూషణ్ పై త్వరలో నిర్ణయం
కిమ్ తో చర్చలా...వృధా

jayalalitha-death-apduniaత‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతిపై నెలకున్న రహస్యాలు వెలుగులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు మాజీ న్యాయమూర్తి ఆరుముఖస్వామి. జయ మృతి పై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. శశికళ ఆమెను చంపేసిందని కొందరు, కాదు సహజ మరణం అని మరికొందరు… అసలు జయలలిత చనిపోయేందుకు విషం ఇచ్చారని ఇంకొందరు వాదిస్తున్న సంగతి తెలిసిందే. తాను జయ కుమార్తెనంటూ ఇటీవల మరో యువతి రంగంలోకి వచ్చారు. అందుకే వాస్తవ పరిస్థితిని తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు వచ్చారు ఈ రహస్యాలను చేధించనున్న కమిషనర్ ఆరుముఖస్వామి. ఈ మేరకు ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. చైన్నై చేపాక్‌లోని ఎళిలగం భవనం ప్రాంగణంలోని కలశ మహాల్‌ను ఇందుకు సిద్ధం చేశారు. ఈ కార్యాలయంలో జస్టిస్‌ ఆరుముఖస్వామి బాధ్యతలు స్వీకరించి పని మొదలు పెట్టారు. జయలలిత మృతిపై మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే నిర్వాహకులు, మాజీ మంత్రులు, అపోలో ఆస్పత్రి యంత్రాంగం, వైద్యులు, లండన్‌ డాక్టర్‌ రిచర్డ్‌ బాలే, ఎయిమ్స్‌ వైద్య నిపుణులు తదితరులకు త్వరలో సమన్లు జారీ చేయవచ్చని తెలుస్తోంది. వారే కాదు..జయ బంధువులు, స్నేహితులు, వారి కుటుంబ సభ్యులను విచారణ నిమిత్తం కలశ మహాల్‌కు రానున్నారు. వారు చెప్పినవి. విన్నవి. తాము తెలుసుకున్నవి. వాస్తవం ఏంటనేది తమ నివేదికలో వారు పొందు పరచనున్నారు. నివేదిక మొత్తం అందాక.. అవసరాన్ని బట్టి సి.ఎం పళనిస్వామి నిర్ణయం తీసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com