Home > Politics > ఉపాధ్యాయుడు ఆదర్శంగా వుండాలి : కడియం శ్రీహరి

ఉపాధ్యాయుడు ఆదర్శంగా వుండాలి : కడియం శ్రీహరి

నదుల అనుసంధానంతో కరువు దూరం : మంత్రి లోకేశ్
అడ్డంకులు సృష్టించినా వెన‌కాడేది లేదు: చ‌ంద్ర‌బాబు

kadiyam-sri-hari-apduniaప్రభుత్వ విద్యను కాపాడుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం నాడు రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విద్యావ్యవస్థ నిర్వీర్య స్థితిలో ఉందన్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, ప్రజలు సమన్వయంతో పని చేస్తేనే ప్రభుత్వ విద్యను కాపాడుకోగలమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల పాఠశాలలో సన్నం బియ్యంతో అన్నం పెడుతున్నామని తెలిపారు. 525 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులందరికీ అవార్డులను ప్రదానం చేశారు విద్యాశాఖ మంత్రి. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారందరికీ కడియం అభినందనలు తెలిపారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉత్తమ ఉపాధ్యాయులు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *