Home > Movies > ధ్యాంక్స్ టూ ఏపీ : కమల్, రజనీ

ధ్యాంక్స్ టూ ఏపీ : కమల్, రజనీ

గృహంలో హారార్ సెక్స్
సెకండ్ మ్యారేజ్ కి రేణు రెడీ

kamalhassan-rajinikanth-apduniaఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు ప్రకటించడం పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది, హృదయపూర్వక ధన్యవాదాలని రజనీకాంత్ ట్వీట్ చేశారు. తెలుగు తెరతో ఎంతో అనుబంధం ఉన్న కమల్ హాసన్ కూడా ఎన్టీఆర్ పురస్కారం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.నాకు ఇంతటి గౌరవం ఇచ్చిన ఆంధ్రకు ధన్యవాదాలు అని కమల్ హాసన్ ట్వీట్ చేశాడు. మీ మద్దతుకు రుణపడి ఉంటాను. నా కెరీర్ ఆరంభం నుంచి మీ మద్దతు అపారం, కృతజ్ఞతలు, రజనీకి కంగ్రాట్స్ అని కమల్ ట్వీట్ చేశాడు. దీనికి రజనీకాంత్ బదులిస్తూ.. థ్యాంక్యూ కమల్ నీకు కూడా కంగ్రాట్స్ అని చెప్పారు.సినీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలను అందజేస్తోంది. 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2014లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎంపికవగా, మరుసటి ఏడాది పురస్కారాన్ని రజనీకాంత్‌కు, 2016కు గానూ కమల్ హాసన్‌కు ఈ అవార్డును ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *