Home > Politics > ఆయుష్ శాఖ ఆసుపత్రులు తక్షణమే బలోపేతం

ఆయుష్ శాఖ ఆసుపత్రులు తక్షణమే బలోపేతం

కర్ణాటక ఎన్నికల్లో చిరంజీవి, పవన్
చంద్రబాబు అసంతృఫ్తి

kamineni-srinivas-apduniaసచివాలయంలో శుక్రవారం వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి డా.కామినేని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖపరంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. జూన్ 21న “అంతర్జాతీయ యోగ దినోత్సవం” ను ఏపీలో నిర్వహించే అంశంపై చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో కర్నూలు లో “స్టేట్ క్యాన్సర్ సెంటర్ ” నిర్మాణానికి శంకుస్ధాపన చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. క్యాన్సర్ సెంటర్ నిర్మాణనికి టెండర్లు త్వరలో పిలుస్తామన్నారు. ఆయుష్ శాఖలో ఉన్న ఆసుపత్రులను తక్షణమే బలోపేతం చేయాలన్నారు. ఆయుష్ ఆసుపత్రులలో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలన్నారు. వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా విద్యార్ధులకు హోమియో మందులు పంపిణి చేయాలని నిర్ణయించారు. వెల్ నెస్ సెంటర్లు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ ఆయుర్వేద మందులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. యోగ, న్యాచురోపతి పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, అనంతపురం జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా మార్చలని ఆర్ధిక శాఖకు నివేదిక పంపడం జరిగిందన్నారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ఎస్సార్ లుగా పనిచేస్తున్న వైద్యులకు జీతాలు చెల్లింపు విషయంలో ట్రెజరి డైరక్టర్ తో మంత్రి మాట్లాడి డాక్టర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని డిఎమ్ఈ ని ఆదేశించారు. ఏపీ.ఎమ్.ఎస్.ఐ.డి.సి సూచించిన ప్రభుత్వ ఆసుపత్రులలో శిధిలావస్తకు చేరిన భవనాలను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఆయుష్, ఏపీ శాక్స్, ఐపియమ్ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీ.ఎమ్.ఎస్.ఐ.డి.సి ఎండి గోపినాధ్, ఆయుష్ కమీషనర్ శోభ, ఏపీవివిపి కమీషనర్ దుర్గాప్రసాద్, డిఎమ్ఈ సుబ్బారావు, అకాడమిక్ డిఎమ్ఈ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *