Home > Editorial > కరోనా కథ కంచికేనా..?

కరోనా కథ కంచికేనా..?

స్కిల్‌ డెవలప్ మెంట్ కోర్సులపై కాన రాని శ్రద్ధ
ప్రభుత్వానికి మాయని మచ్చగా లీకేజీలు
 
22-VJ-BUSES_apduniaప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంలో కీలకపాత్ర పోషించే కొత్త బస్సులను తెచ్చుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ భరోసాతో రెండు నెలల క్రితమే ఆర్టీసీకి డబ్బు చేతికి వచ్చినా బస్సులు మాత్రం రాలేదు. వేసవికి ముందే ఏసీ బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులను ప్రజా రవాణాసంస్థ వైపు తిప్పుకోవాలన్న యాజమాన్యం ఆశలు ఆశించిన స్థాయిలో నెరవేరలేదు. ఆర్టీసీ 114 ‘కరోనా’ బస్సులకు ఆర్డర్‌ ఇచ్చి రెండు నెలలైంది. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి అచ్చెన్నాయుడు ఏప్రిల్‌ మూడోవారంలో విజయవాడలో 15 బస్సులను ప్రారంభించారు. మరో 99 బస్సులు అదే నెలలో వస్తాయని అధికారులు అప్పట్లోనే వెల్లడించారు. మే నుంచి తగినన్ని ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వేసవి దాదాపు ముగిసినా కనీసం మూడో వంతు బస్సులు కూడా విజయవాడకు చేరలేదు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఏసీ బస్సుల్లో ప్రయాణానికే మొగ్గు చూపారు. ఇక, ఆర్టీసీలో 200కు మించి ఏసీ బస్సులు లేవు. దీంతో ప్రైవేటు వైపు వెళుతున్నారు తప్ప ఆర్టీసీకి చెందిన సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ వంటి బస్సులను సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఈ వేసవికి ముందు టీడీపీ 
ఎంపీకి చెందిన కేశినేని ట్రావెల్స్ సంస్థతో పాటు మరో ట్రావెల్స్ సంస్థ బస్సులను నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఇటు తగినన్ని ఆర్టీసీ ఏసీ బస్సుల్లేక, అటు ప్రైవేటు ధరలు అందుబాటులోకి రాక ఎక్కువ మంది ప్రయాణికులు ప్రైవేటు కార్లను ఆశ్రయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రైవేటు వ్యక్తుల వరకూ షేర్‌ కార్లలో ప్రయాణిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, ముంబై, విజయవాడకు మాత్రమే ఉన్న కార్ల 
సర్వీస్‌ ఇప్పుడు విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు విస్తరించిది. అందులో ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా కరోనా బస్సులను సకాలంలో తెప్పించుకొని విశాఖపట్నం, విజయవాడకు మొత్తం 114 కరోనా బస్సులను కేటాయించి విజయవాడ నుంచి హైదరాబాద్‌, తిరుపతి ఇతర జిల్లా కేంద్రాలకు, విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు తిప్పాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వం తొలుత ప్రారంభించిన 15 బస్సుల తర్వాత కేవలం 10 కరోనా బస్సులు మాత్రమే విజయవాడ చేరాయి. మిగతా బస్సులు ఎప్పుడొస్తాయో అధికారులే సరిగా చెప్పలేక పోతున్నారు. సూపర్‌ లగ్జరీ బస్సుల వరకైతే ఛాసీ తీసుకొని బయట బాడీ కట్టిస్తామని, ఏసీ బస్సులు కంపెనీలే పూర్తి చేసి ఇస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఐతే ఇటీవల విజయవాడలో వర్షం పడి వాతావరణం ఒక్కసారిగా 
చల్లబడింది. విశాఖపట్నంలోనూ ఎండలు తగ్గు ముఖం పట్టాయి. దీంతో ఏసీ బస్సుల్లో ప్రయాణాలకు ఇక ప్రయాణీకులు తక్కువ ఆసక్తి చూపే అవకాశముంది. సకాలంలో కొత్త బస్సులు తెచ్చుకొని ఉంటే కొంతమేర కలెక్షన్లు వచ్చేవని ఆర్టీసీ అధికారులే చెబుతున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతోపాటు విద్యా సంవత్సరం జూనలో ప్రారంభమవుతుండటంతో ఇక కొత్త బస్సులు ఎప్పుడొచ్చినా ఒక్కటే అనే భావన వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *