Home > Editorial > తాత్కలిక భవనాల్లో కస్తూర్బాలు

తాత్కలిక భవనాల్లో కస్తూర్బాలు

కట్టుబాట్లకు, ఒప్పందాలకు విలువలు ఉండవా
బహిరంగంగానే నకిలీ మద్యం అమ్మకాలు లిక్కర్ మాఫియా పాత్రపై ఆరా
 
kastur_apduniaమహబూబ్ నగర్  జిల్లా కు నాలుగు కొత్త కస్తూర్బాలు మంజూరయ్యాయి. నాగర్‌కర్నూల్ నూతన జిల్లాగా ఆవిర్భవించడంతో కొత్తగా ఏర్పడిన మండలాలు ఊర్కొండ, చారగొండ, పెంట్లవెల్లి, పదరలకు ఇంగ్లిష్ మీడియం కస్తూర్బా పాఠశాలలను ప్రభుత్వం కేటాయించింది. కాగా ఈ పాఠశాలలను ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో ప్రారంభించనున్నారు. ఊర్కొండ స్కూల్‌ను కల్వకుర్తి కేజీబీవీలో ప్రారంభిస్తారు. అలాగే చారగొండ స్కూల్‌ను జడ్పీ హైస్కూల్‌లో, పదర స్కూల్‌ను అదే గ్రామంలో ఉన్న అమ్రాబాద్ కస్తూర్బాలో, పెంట్లవెల్లి స్కూల్‌ను కొల్లాపూర్ కస్తూర్బాలో ఏర్పాటు చేయనున్నారు. పా ఠశాలలకు అనువైన భవనాలు లేకపోవడంతో విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ, పాత పాఠశాలల్లోనే నడిపించనున్నారు. ఇందులో అభ్యసించేది బాలికలు కా వడంతో ప్రధానంగా రక్షణ సమస్య ఏర్పడుతుంది. దీనికి తోడు టాయిలెట్లు, అనువైన గదులు ఈ కొత్త మండలాల్లో లభించడం కష్టమైంది. ఈ క్రమంలో పాత కస్తూర్బాల్లో కొత్త కస్తూర్బాలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ పాఠశాలలు 6,7 తరగతుల్లో 40 మంది విద్యార్థుల చొప్పున 80మందితో నడుస్తాయి. ఆ తర్వాత తరగతులను అప్‌గ్రేడ్ చేస్తూ 10వ తరగతి వరకు చేరుస్తారు. ఒక్కో పాఠశాలను రూ.2.75 కోట్లతో అధునాతనంగా నిర్మిస్తారు. గతంలోని పాఠశాలలనూ రూ.1.25కోట్లతో మాత్రమే నిర్మించారు. ఈ భవనాలు అధునాతన హంగులతో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెంట్లవెల్లి స్కూల్‌కు రూ.2.75కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *