Home > Movies > కేటీ పెర్రికి 10 కోట్ల మంది ఫాలోయిర్స్

కేటీ పెర్రికి 10 కోట్ల మంది ఫాలోయిర్స్

బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
డిఫరెంట్ పాత్రలో కనువిందు చేస్తున్న కాజల్

katy-perry_apduniaసెలబ్రిటీలను ఫాలో అయ్యేవారు సొషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారు. సినిమా స్టార్స్‌కైతే కాస్తా ఎక్కువ. అదీ బాలీవుడ్‌, హాలీవుడ్‌ హీరో హీరోయిన్స్‌కు వీరి మోతాదు మిగితా వారిని మించిపోతుంది. సాధారణంగా ఓ స్టార్‌కు కోటి మంది ఫాలోవర్స్‌ ఉంటే అదొక గొప్ప విషయమే. ఇంతమంది ఫాలో అవుతున్నారా? అనుకుంటాం. అదే ఆ సంఖ్య ఐదు కోట్లకు చేరితే అబ్బో…అనుకుంటాం..నిజంగా గొప్ప విషయమే… కానీ గాయకులకు ఆ స్థాయిలో ఉంటారా? అంటే చాలా వరకూ ఉండరేమో అనకుంటాం. అలా అనుకుంటే పొరబడినట్టే… మనం ఇప్పటి వరకూ అనుకున్న ఫాలోవర్స్‌ సంఖ్య అంతకు మించి డబుల్‌ స్థాయిలో ఉన్నారు వారికి. ఇంతకీ ఎంతనుకుంటున్నారా? ఏకంగా పది కోట్ల మంది ఆ గాయనికి అనుచరులు ఉన్నారట. ఆమె ఎవరో కాదు… హాలీవుడ్‌ సంచలనం, సింగర్‌ కేటి పెర్రీ. ఈమె సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఆమె ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరుకుంది. అంటే పది కోట్ల మంది. దీంతో పది కోట్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న ట్విట్టర్‌ తొలి యూజర్‌గా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఈ అరుదైన మార్క్‌ను అభిమానుల వల్లే చేరుకోగలిగానని వారికి ధన్యవాదాలు తెలిపింది ఈ గాయని. ఆమె ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని ఇతర సెలబ్రిటీల ఫ్యాన్స్‌ కొందరు ఇటీవల కేటి ట్విట్టర్‌ ఖాతాను హ్యాక్‌ చేసి.. అసభ్య సందేశాలు పోస్ట్‌ చేశారు కూడా. ప్రస్తుతం కేటి తన కొత్త ఆల్బమ్‌ ‘విట్‌నెస్‌’ తో ఈవెంట్లలో బిజీగా ఉంది. 2015లో ఆమె కో డ్యాన్సర్‌ షార్క్‌ డ్రెస్‌ ధరించడంతో అప్పటో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ’96 అవర్‌’, ‘బిగ్‌ బ్రదర్‌’ లాంటి కార్యక్రమాలతో 190 దేశాల అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫాలోవర్స్‌ సంఖ్యను అమాంతం రెట్టింపు చేసుకుంది. 100 మిలియన్‌ ఫాలోవర్లతో కేటి అగ్రస్థానంలో నిలవగా.. 97 మిలియన్లతో పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీయిబర్‌, 85 మిలియన్‌ ఫాలోవర్లతో మరో పాప్‌ సంచలనం టేలర్‌ స్విఫ్ట్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *