Home > Politics > రేవంత్ పైన కవిత పోటీ

రేవంత్ పైన కవిత పోటీ

బాలల హక్కులపై అవగాహన : ఎంపీ బండారు దత్తాత్రేయ
వరుస ఎన్నికల్లో బీజేపీ డీలా

revanth-kavirtha-apduniaకొడంగల్ లో ఉప ఎన్నికల వస్తే రేవంత్ రెడ్డికి పోటీగా కవిత బరిలోకి దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గట్టి పోటీ ఖాయం. దమ్ముంటే నా మీద పోటీ చేయండి. గెలవండని రేవంత్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. మరోవైపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగాను పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే మాట చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ నేతల మాటలను సమాధానం చెప్పేదిశగా గులాబీ దండు సిద్దమవుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే..ఈ పోటీ అంతా ఉప ఎన్నిక వస్తేనే. తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వాస్తవంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేశానని చెప్పినా..ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ మాత్రం అసలు ఆయన రాజీనామా చేయలేదన్నారు. తాను సి.ఎం పేషిలోనే లేఖ ఇచ్చానని చెప్పారు రేవంత్ రెడ్డి. సి.ఎం చంద్రబాబునాయుడు దీని పై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. కావాలనే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను చంద్రబాబు స్పీకర్ మధుసూధనాచారికి పంపలేదా..అసలు ఏం జరిగిందనే అంశం పై నెలకున్న ఉత్కంఠకు తెరపడలేదు. రాజీనామా ఆమోదం పొంది ఎన్నికలు జరగడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. అందుకే ఒత్తిడి చేయడం లేదంటున్నారు. కవితతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపారం చేయాలనుకున్నారని పయ్యావుల కేశవ్ లాంటి నేతలు బయట పెట్టారు. కంపెనీ పేరు రిజిస్టర్ చేశారని..విమర్శలు వస్తాయనే కారణంతో ఆపారంటున్నారు. వాస్తవంగా దీని పై కవితగానీ..రేవంత్ రెడ్డి గానీ మారు మాట్లాడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *