Home > Politics > ఆడపిల్ల పుడితే సరస్వతి పుట్టిందనుకోవాలి : ఎంపీ కవిత

ఆడపిల్ల పుడితే సరస్వతి పుట్టిందనుకోవాలి : ఎంపీ కవిత

నల్గొండ బరిలో రేవంత్ రెడ్డి?
15న జీవో 39కు వ్యతిరేకంగా ధర్నా

kavitha-apduniaఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారని కాని ఆడపిల్ల పుట్టిందంటే చదువుల తల్లి సరస్వతి పుట్టిందనుకోవాలని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలో నూతనంగా మంజూరైన తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కవిత బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ గిరిజన ఆడపడుచులు బయటకు పోయి చదువాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసిఆర్ గిరిజన, ఎస్సి, ఎస్టి, మహిళా కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం 320 మంది విద్యార్ధులు వుండేలా చూస్తామని అన్నారు. తెలంగాణ ఆడపడుచుల పండుగైనటువంటి బతుకమ్మ పండుగ సందర్బంగా నిరుపేద మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి 8 లక్షల చీరలను పంపిని చేస్తున్నదని, ప్రతి జిల్లాకు 5 లక్షల 31 వేల చీరలను పంపిని చేస్తున్నదని కవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిల పునరుద్దరించటానికి 90 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. జిల్లాలో మహిళా జనాభ అధికంగా వుందని మహిళల అభివృద్దికి తాను తోడ్పడతానని కవిత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *