Home > Politics > నిధులు మళ్లింపు నిజం కాదు : సీఎం కేసీఆర్

నిధులు మళ్లింపు నిజం కాదు : సీఎం కేసీఆర్

గుజరాత్ లో మోడీ వర్సెస్ రాహుల్
జగన్ యాత్రలో పుల్కానే మెనూ

kcr-assembly-apduniaఎస్సీలకు కేటాయించిన నిధులు కాంగ్రెస్ హయాంలోనే పక్కదారికి మళ్లించారని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎస్సీ ప్రత్యేక ఖర్చు 38.09 శాతం ఖర్చు, ఎస్టీ ల కోసం 41.13 ఖర్చు చేసామని అన్నారు. ఎస్సీల పేదరికం గుర్తించాం కాబట్టే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 20లక్షలు ఇస్తున్నామన్నారు. ఆ స్కీముకి 25 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. దళితులు పరిశ్రమంగా ఎదుగడనికి కూడా నిధులు కేటాయించామని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు పెట్టామన్నారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అంతేగాని లెక్కలు చూపకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి తెలంగాణ కృషి చేస్తుందని ఆయన అన్నారు. దళితులలో పేదరిక నిర్మూలన చేయడానికే ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలవిషయంలో చర్చ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండు రోజులు శాసనసభ పొడగించాలని సభ్యుల తరుపునా స్పీకర్ ని కోరుతున్నానని కేసీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com