Home > Politics > వైద్యానికి జీవం : సీఎం కేసీఆర్

వైద్యానికి జీవం : సీఎం కేసీఆర్

ఖచ్చితమైన హామీతో ఎన్నికలకు : వైఎస్ జగన్
లక్షా 42 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి..

kcr-apduniaనిర్వీర్యమైన వైద్య ఆరోగ్య శాఖకు జీవం పోశామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ వైద్య ంకోసం వచ్చిన వ్యక్తిని తిప్పి పంపకుండా వైద్యం అందిస్తున్న వైద్యులను అభినందించాలన్నారు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని.. విమర్శలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. అయినప్పటికీ వైద్యులు చిత్తశుద్ధితో వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యరంగంలోని డాక్టర్లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయరంగంపై వివరణిస్తూ వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 23 లక్షల పంపు సెట్లకు సోమవారం రాత్రి నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో ఉత్పతన్నమయ్యే పరిస్థితిని 5,6 రోజులు అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే యాసంగి నుంచి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *