Home > Bhakti > శ్రీవారికి కేసీఆర్ కానుక సమాచారం…

శ్రీవారికి కేసీఆర్ కానుక సమాచారం…

శివాలయాలకు పోట్టేత్తిన భక్తులు
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మూత్సవాలు ప్రారంభం

tirumala-kcr-apduniaతిరుమల వెంకన్న ఆభరణాలలో మరో కలికితురాయి చేరనుంది. కోనిటిరాయునికి కమలంతో తయారు చేయించిన సాలిగ్రామ హారం, ఐదు పేటల మకరకంటి ఆభరణాలు శ్రీవారి బొక్కసం కు చేరనున్నాయి…. అయితే ఈ ఆభరణాల కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇవి వ్యక్తిగతంగా ఏ దాత సమర్పిస్తున్నదో కాదు, ఈ అపురూప కానుకలు సాక్షాత్తూ తెలంగాణా ప్రభుత్వం తరపున శ్రీవారికి చేరనున్నాయి. తెలంగాణా రాష్ట్రం సిద్దించిన సందర్భంగా ముఖ్యమంత్రి కే.సి.ఆర్ స్వయంగా తిరుమల వెళ్లి ఆపదమోక్కులవాడికి ఆభరణాల సమర్పణ ద్వారా తన మొక్కును తీర్చుకోనున్నారు.

ఏడుకొండలవాడికి బంగారు ధన,కనక రాశులకు కొదవలేధు. నిత్యం కోట్లాదిరూపాయల ధనంతో పాటూ స్వర్ణ కానుకలను భక్తులు సమర్పిస్తూనే ఉంటారు. ఇలా శ్రీవారికి బొక్కసంలో చేరిన వెలకట్టలేని దివ్యాభరణాలు ఎన్నోఉన్నాయి.ఇక వెంకన్నకు మొదటగా తన మామగారైన ఆకాశ రాజు చేయించిన కిరీటంతో పాటూ ఆమధ్య కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి సమర్పించిన కిరీటాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వెంకన్న మూల మూర్తికి అలంకరించేందుకు తెలంగాణా ప్రభుత్వం సుమారు ఐదు కోట్ల రూపాయలతో తయారుచేయించిన సాలిగ్రామ హారం, ఐదుపేట్ల మకరకంటి కానుకగా రానుంది. తెలంగాణా రాష్ట్ర కల సాకారం చేసినందుకు తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు ముఖ్యమంత్రి కే.సి.ఆర్. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ స్వయంగా తన కుటుంబసభ్యులతో కలసి తిరుమలకు వచ్చి తన ఇష్టదైవం అయిన శ్రీవెంకటేశ్వరుని దర్శించుకుని ఆభరణాలు అందచేయనున్నారాయన. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముక్కుపడకలు సమర్పించనున్నారు తెలంగాణా సీఎమ్..అలాగే విజయవాడ లోని కనకదుర్గమ్మకు కూడా ముక్కుపుడకలను ఇవ్వడం ద్వారా తన మొక్కును చెల్లించుకొనున్నట్టు తెలుస్తోంది….

ఇక వెంకన్నకు కేసీఆర్ సమర్పించనున్న ఆభరణాల వివరాలు కొస్తే 3.75 కోట్ల రుపాయల విలువైన కమలం ఆకారంలో ఉండే సాలిగ్రామ హారం బరువు సుమారు 14.200 కిలోలు కాగా…మరో అభరణమైన మకరకంటి బరువు 4.650 గ్రాములు…దీని విలువ సుమారు 1.25 కోట్లు…ఈ నగలు తయారికయ్యే ఖర్చు ఐదు కోట్ల రూపాయలను ఇప్పటికే టిటిడి ఖాతాలో జమ చేసారు తెలంగాణా అధికారులు…కోనేటి రాయుడి ఆభరణాల్లో ఓ ముఖ్య నగగా నిలిచేలా రూపొందిస్తున్నారు. కృష్ణదేవరాయల కాలం నుంచి ఎన్నో నగలు ఏడుకొండలవాడికి అలంకారంగా మారగా.. ఇప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన అరుదైన కానుక స్వామి ఖాతాలో జమకాబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే వివిధ ఆలయాల్లోని దేవుళ్లకు నగలు చేయిస్తానని మొక్కుకున్నట్టు సీఎం కేసీఆర్ గతoలో ప్రకటించిన విషయం తెలిసిందే. స్వయంగా సీఎం కేసీఆర్ తిరుమల వెళ్లి స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల వెంకన్నతోపాటూ , తిరుచానూరు పద్మావతి అమ్మవార్లకు ముక్కుపుడకలు, విజయవాడ కనకదుర్గ, , వరంగల్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేయించి తెలంగాణ ప్రజల పక్షాన మొక్కులు తీర్చనున్నట్టు ప్రకటించారు. వీటికోసం తెలంగాణా దేవాదాయశాఖ నిధులను కూడా విడుదల చేసింది.

శ్రీవారి మూలమూర్తి, ఉత్సవ మూర్తులకు అలంకరించే ఆభరణాలు, కిరీటాలు చేయించిన అనుభవం ఉన్నందున ఈ నగల తయారీ బాధ్యతను టీటీడీ కే అప్పగించింది తెలంగాణా సర్కారు. టిటిడి పారదర్శకంగా టెండర్లను ఆహ్వానించి, అందులో బంగారు నగలు, దేవతామూర్తుల యొక్క కిరీటాలు తయారు చేయటంలో పేరుప్రఖ్యాతులు ఉన్న కోయంబత్తూరు కు చెందిన శ్రీ కీర్తిలాల్ జువెల్లెర్స్ సంస్థకు ఈ నగల తయారీని భాద్యతను అప్పగించింది టిటిడి…ఈ ఆభరణాల తయారీ పూర్తే దాదాపు పది నెలలు అవుతున్నా ఇంత వరకు శ్రీవారికి ఆభరణాల వితరణ మాత్రం జరగలేదు.. శ్రీవారికి చెల్లించాల్సిన కానుకలను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబసభ్యులతో పాటు,మంత్రులు,శ్రీవారి భక్తులతో ప్రత్యెక రైలులో తిరుమలకు వెళ్లి ఈ కానుకలు అందజేసి మొక్కు తీర్చుకోనున్నట్టు తెలుస్తోంది..ఇప్పటికే వరంగల్ లోని భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించి తన మొక్కును తీర్చుకున్నారు ముఖ్యమంత్రి కే.సి.ఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *