Home > Vanitha > Recipes > కీర మిల్క్‌షేక్‌

కీర మిల్క్‌షేక్‌

పల్లీల పూర్ణాలు
పాలపొడి మైసూర్‌పాక్

milk shake_apduniaకావల్సినవి పదార్థాలు :
కీరదోస – నాలుగైదు, పాలు – ఒకటిన్నర లీటరు, చక్కెర – రెండు వందల గ్రా, యాలకులపొడి – అరచెంచా, జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, పిస్తా – అన్నీ డెబ్భైఅయిదు గ్రా, నెయ్యి – రెండుమూడు చెంచాలు.
తయారీచేసే విధానం :
కీరదోస చెక్కుతోపాటూ గింజల్నీ తీసేసి మిక్సీలో మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో పాలు తీసుకుని, చక్కెర వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక అందులో కీరదోస గుజ్జు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. కాసేపటికి అది చిక్కబడుతుంది. ఓ బాణలిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పూ, ఎండుద్రాక్షా, బాదం, పిస్తా పలుకుల్ని వేయించుకోవాలి. ఎండుద్రాక్ష తప్ప మిగిలిన డ్రైఫ్రూట్స్‌ మరీ మెత్తగా కాకుండా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఎండుద్రాక్ష, డ్రైఫ్రూట్స్‌ పొడి, యాలకులపొడి పాలల్లో వేసి మళ్లీ కలిపి ఫ్రిజ్‌లో ఉంచేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *