Home > Vanitha > Recipes > వంటింటి చిట్కాలు ..

వంటింటి చిట్కాలు ..

మీకు మంచి మొగుడు కావాలా..అయితే ఇలా చేయండి
చలికాలంలో చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే...
recieps_apduniaవంటగదిలో చీమలు స్వైరవిహారం చేస్తున్నాయా? ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచండి. కూరల్లో మసాలా ఎక్కువైతే? రెండు మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది. చెక్కతో చేసిన చెంచాలు, గరిటెలు వాసన వేస్తుంటే వాటిని వెనిగర్ కలిపిన నీటిలో ఉంచండి. కొద్ది సేపైన తర్వాత వాడుకోండి. వాసన రావు. వంట చేసేటప్పుడు చేతులు మరకలు అవుతున్నాయా? ఆలుగడ్డ ముక్కలతో రుద్ది కడుక్కోండి. గులాబ్ జామ్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీర్ కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి.గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జామ్‌లు చేసే ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి. చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి. చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *