Home > Sports > విదేశాల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన కోహ్లీ

విదేశాల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన కోహ్లీ

మిథాలికి బీఎండబ్ల్యూ కారును బహూకరించిన చాముండి
నిరాశ పరిచిన ధావన్
 
1000 runs_apduniaగాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పటిష్టమైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. చివర్లో ముకుంద్ (81) అవుటవగా, కోహ్లి 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కొంత కాలంగా టెస్టుల్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విరాట్ ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. చక్కటి టచ్‌లో కనిపించిన కోహ్లి.. హాఫ్ సెంచరీతోపాటు విదేశాల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత కెప్టెన్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో విరాట్‌ వెయ్యి పరుగులు చేయగా.. కెప్టెన్‌గా సచిన్ 19 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లి, ముకుంద్ ఇద్దరూ ఒకే మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేయగా.. ముకుంద్ రెండో అర్ధ సెంచరీ చేసేలోగా.. విరాట్ 16 సెంచరీలు చేశాడు .తొలి ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ (190), పుజారా (153) భారీ శతకాలు బాదడంతోపాటు.. రహానే (57), పాండ్య (50) అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ 600 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో ప్రదీప్ ఒక్కడే ఆరు వికెట్లు తీశాడు. టీమిండియా విసిరిన భారీ సవాల్‌ను చేధించే క్రమంలో శ్రీలంక ఆదిలోనే తడబడి వికెట్లను చేజార్చుకుంది. కానీ ఉపుల్ తరంగ (67), ఏంజెలో మ్యాథ్యూస్ (83), పెరీరా (92 నాటౌట్) లంక పరువు నిలిపారు. జడేజా మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *