Home > General > కోడి పథకం లో అక్రమాలు

కోడి పథకం లో అక్రమాలు

బ్రిటన్ వీసా ఉంటే 177 దేశాల్లో ప్రయాణించవచ్చు
త్వరలో వంద రూపాయిల కాయిన్

kolla-forum-apduniaఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ‘చిత్తూరు కోడి’ పథకాన్ని అధికారులు రూపొందించారు. మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమయింది. వెయ్యి యూనిట్లు మంజూరు చేయనున్నారు. కోళ్ల ఫారానికి అవసరమైన నేల, నీటి సౌకర్యం లబ్ధిదారులు కల్గివుండాలి. పెంపకానికి అవసరమైన షెడ్డు కోసం రూ. 3.56 లక్షలు రుణమిస్తారు. ఇందులో రూ.1 లక్ష సబ్సిడీగా పరిగణిస్తారు. రుణమొత్తం రూ. 2.56 లక్షను జిల్లా సహకార బ్యాంకు అందచేస్తుంది.కోడిపిల్లల సరఫరా, పెంపకం తదితరాల సేవలను అధికారులు సూచించిన హేచరీస్‌ ద్వారానే లబ్ధిదారుల పొం దాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రైవేటు హేచరీస్‌తో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ హేచరీస్‌ సంస్థకు లాభం చేకూర్చేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హేచరీ ద్వారా తీసుకున్న కోడి పిల్లలను లబ్ధిదారులు తమ షెడ్లలో 8 వారాలపాటు పెంచాలి. తరువాత వాటిని అదే హేచరీస్‌కు అప్పగించాలి. కిలోకు రూ. 5.50 చొప్పున పెంపకం దారులకు హేచరీస్‌ చెల్లిస్తుంది. షెడ్డుకు 2 వేల పిల్లలను హేచరీస్‌ సమకూర్చనుంది. లబ్ధిదారులకు ఇక్కడే సందేహాలు కలుగుతున్నాయి. పెంపకంలో లోపాలు జరిగితే కోళ్ల బరువు అనుకున్నంతా రాదు. ఫలితంగా నష్టం వాటిల్లే అవకాశముంది. వీరికి తాము నచ్చిన హేచరీల నుంచి పిల్లలను తెచ్చుకునే వీలు లేదు. పూర్తి అవగాహన ఉన్న ఓ కోళ్ల ఫారం యజమాని దీనిపై మాట్లాడుతూ రెండునెలల్లో పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటేనే లాభం అంతంతమాత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. తొందరపడితే నష్టపోతారనే ఆందోళన వ్యక్తం చేశారు. సహకార కో ఆపరేటివ్‌ బ్యాంకుల ద్వారానే రుణం తీసుకోవాలని షరతు విధించారు. డ్వాక్రా మహిళలకు ఆది నుంచి ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే లావాదేవీలు నెరపుతున్నారు. ఇప్పుడు కోళ్లఫారాల కోసం మరోమారు కొత్తగా సహకార బ్యాంకులో ఖాతా తెరవాలి. హేచరీస్‌లిచ్చే కమీషన్‌ కూడా ఈ ఖాతాకే జమచేస్తారు. లబ్ధిదారుల ప్రమేయం లేకుండా కమీషన్‌ను నుంచి బ్యాంకు రుణాల మొత్తాలను జమ చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు చెల్లిస్తుంది. ఇది సరికాదని దరఖాస్తులదారులంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *