Home > Crime > మరో వివాదంలో కోలివుడ్ నటుడు

మరో వివాదంలో కోలివుడ్ నటుడు

ఎట్టకేలకు మనోజ్ పాండే అరెస్ట్
డేరా బాబా అకౌంట్ లో 75 కోట్లు

dileep-apduniaమలయాళీ నటులు తమ సినిమాలు, షూటింగ్‌లకు సంబంధించిన వార్తల కంటే.. వివాదాలతోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ ప్రముఖ నటిపై గ్యాంగ్ రేప్ వెనుక హస్తం ఉందనే ఆరోపణలతో దిలీప్ వార్తల్లో నిలవగా.. తాజాగా మరో యాక్టర్ వంతు వచ్చింది. ట్రాన్స్‌జెండర్ మేకప్ ఆర్టిస్ట్ అయిన వినీత్ సీమా.. ఓ ‘స్పెషల్ ఫ్రెండ్’ తనతో చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫే‌స్‌బుక్‌లో పోస్ట్ చేశారు.వినీత్ సీమా అనే ట్రాన్స్‌జెండర్ వధువులకు మేకప్ చేస్తారు. తను గతంలో కామెడీ పాత్రల్లో నటించేవారు. యెహియా కాదెర్ అనే సీరియల్ నటుడు తనతో చేసిన చాటింగ్ వివరాలను వినీత్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారింది.నీ ఫొటోలు సెక్సీగా ఉన్నాయి. మరిన్ని ఫొటోలు చూడాలనుకుంటున్నా.. పంపుతావా అంటూ వినీత్‌తో ఫేస్‌బుక్ ద్వారా చాట్ చేశాడు. తనకు ఇంట్రెస్ట్ లేదని వినీత్ చెప్పడంతో.. కోపంగా చాట్ చేశాడు.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *