Home > Politics > రైతు సమన్వయ సమితి ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం : మంత్రి కేటీఆర్

రైతు సమన్వయ సమితి ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం : మంత్రి కేటీఆర్

15న జీవో 39కు వ్యతిరేకంగా ధర్నా
తెలుగు భాష కోసం కేసీఆర్ క్రిషి

ktr-apduniaదేశ చరిత్ర లో రైతు సమన్వయ సమితి ల ఏర్పాటు విప్లవాత్మక చర్య అని రాష్ట్ర ఐటి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.రైతుల సమగ్ర అభివృద్ధి లో రైతు సమన్వయ సమితి లు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల మండలం రగుడు గ్రామంలోని సాయి మనికంత గార్డెన్ లో గ్రామ , మండల సమన్వయ సమితి సభ్యులకు వ్యవసాయ శాఖ అధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్. వ్వవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని విధాలుగా చితికి శల్యమైన రైతు ను తెలంగాణ రాష్ట్రంలో వ్యయసాయం ను పండగ చేసి రైతు ను రాజుగా చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. వసాయ పంపు సెట్లకు 24 గంటల విద్యుత్ , పెద్ద ఎత్తున రిజ ర్వా యర్ ల నిర్మాణం , మిషన్ కాకతీయ , పెట్టుబడి రాయితీ వంటి కార్యక్రమాలు అందులో బాగామేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా  రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల ద్వారా 1200 టీఎంసీలను ఒడిసి పట్టి ఒక కోటి 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యం తో ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి నియోజక వర్గంల్లో కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నామని తెలిపారు. సంవత్సరాంతం లోగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని 2 లక్షల పై చీలుకు ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు . 2 సంవత్సరాల లో జిల్లా తో పాటు రాష్ట్రంలో ని అన్ని చెరువులను బలోపేతం చేస్తామన్నారు. ప్రాజెక్ట్ లు పూర్తీ చేసుకుంటే, వర్షాల కోసం చూసే పరిస్థితి ఉండదన్నారు . గౌరవ ప్రదంగా వ్యవసాయం చేసుకోవచ్చునన్నారు . వలసలు ఆగి పోతాయన్నారు. దేశంలోనే తొలిసారిగా రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేశామని తెలిపారు. గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. గతంలో 6 గంటల కరెంట్ కోసం పోరాడిన పరిస్థితి నుంచి ప్రస్తుతం 24 గంటల కరెంట్ వద్దు అని మోర పెట్టుకునే పరిస్థిటికీ వచ్చామన్నారు . దీని బట్టి మన్దమ్ ఈ రంగలో సాధించిన ప్రగతి అర్థం చేసుకోవచునని కేటీఆర్ అన్నారు. రూ. 1024 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసమే రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు అని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ , సౌందర్య సాధనాలు , ఇతరత్రా ఉత్పత్తి చేసిన వారు … వారి ఉత్పతులకు వారే ధర నిర్ణయిస్తే రైతు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు దళారులు ధర నిర్ణయించే పరిస్థితి ఉందన్నారు . సమితి ల వాళ్ళ ఇక నుంచి ఆ పరి స్థితి ఉండదన్నారు . అదే విధంగా రైతు భూ సమస్యలు దూరం చేసేందుకు భూ దస్త్రాల నవీకరణకు శ్రీకారం చుట్టమన్నారు .  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , మంత్రులు ప్రసంశితున్నారని మంత్రి తెలిపారు.

Tags: , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *