Home > Politics > రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : కేవీపీ

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : కేవీపీ

సీఎం దద్దమ్మ : మాజీ ఎంపీ పొన్నం
యువమంత్రి పెట్టబడుల వేట

kvp-congress-apduniaఆంధ్ర ప్రజల ప్రయోజనాల గురుంచి చంద్రబాబుకు ఇప్పటికైనా పట్టించుకుంటే ఏపీ ప్రజలు అదృష్టవంతులు అవుతారు. చంద్రబాబుకు ఆగ్రహం వచ్చినదని, పళ్ళు పటపట కొరికారని, గడ్డం పెంచాడని ఇలాంటి లీకులతో కాలక్షేపం చేస్తున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. సోమవారం నాడు సభలో విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసారు. డు జస్టిస్ టు ఆంధ్రప్రదేశ్ అనే నినాదం ప్లకార్డు పట్టుకుని సభలో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. అదివారం జరిగిన సమావేశం తర్వాత తీవ్రమైన పోరాటం చేస్తాం అని టీడీపీ చెప్పింది. పోలవరం కాంట్రాక్టు ల కోసం, ఖర్చు లేకుండా బిల్లులు ఆమోదిచడం కోసం,రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు పెడుతున్నారని అయన విమర్శించారు. ఈ సారైనా ప్రజలను వంచించకుండా ఉంటారని ,ఒక ఆంధ్ర పౌరుడిగా నేను ఆశిస్తున్నా. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే భాగంగా ఒక షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ కి ఒక నోటీస్ ఇచ్చాం. కాల్ అట్టెంషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ విశాలమైన దృక్పథంతో ,రాజకీయ పరిణితితో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను ఆకాంక్షిస్తారు కనుక చైర్మన్ సభలో తప్పకుండా ప్రవేశ పెట్టడానికి ఆమోదం తెలియజేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *