Home > Tirumala News > తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు

17న బీచ్ లో బాబు నిశ్శబ్ద దీపావళి
శ్రీశైలంలో జలకళ

tirumala-ghat-apduniaభారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కగార్ల గుడికి సమీపంలోని రహదారిపై కొండచరియలు పడిపోవడంతో తిరుమల నుంచి తిరుపతి వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. తిరుమల నుంచి తిరుపతికి రావాల్సిన వాహనాలను కొండపై ఉన్న టోల్ గేటుకు ఆవలే నిలిపివేస్తుండటంతో, తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది రోడ్డుపై ఉన్న బండరాళ్లను, చెట్లను తొలగించారు. .గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగానే మట్టితో కూడిన బండలు నాని రహదారిపైకి పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఏ వాహనానికీ ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. వారాంతం సమీపించడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *