Home > Politics > ప్రజారాజ్యం కన్నా పవన్ కు తక్కవ శాతం ఓట్లు

ప్రజారాజ్యం కన్నా పవన్ కు తక్కవ శాతం ఓట్లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తానో తెలుసా?.. ప‌వ‌న్
పవన్ అన్నా... నీకు నీ జెండాకు సెలవు...

janasena-pawan-apduniaఆలూ లేదు. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నది సామెత. కానీ ఆ సామెతను నిజం చేసేలా ఉన్నాయి కొన్ని సర్వేలు. పార్టీ అభ్యర్థులు ఎవరో తెలియదు. ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. కానీ జనసేన పార్టీకి ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయో చెబుతున్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తారు. ఏంటనేది తెలియదు. కానీ సర్వే ఫలితాలు వచ్చాయి. ఎంత శాతం వారికి ఓటింగ్ పడుతుందో కూడ చెప్పేశాయి. అదే మరి విచిత్రమంటే.
తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. కీలక మలుపులు తిరుగుతున్నాయి. అధికార పార్టీకి గొడుగు పట్టేలా ఉంది పవన్ పార్టీ పరిస్థితి. చంద్ర‌బాబు ఏపీని అభివృద్ధి చేసేందుకు త‌న వంతుగా పాటుపడుతున్నాడు. విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ అదే ప్రజల కోసం సుదీర్ఘ‌మైన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేస్తున్నారు. సినీన‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ పేరుతో వారి వద్దకు వెళుతున్నాడు. ఫలితంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయనేది ఇప్పుడు కీలకంగా మారింది.

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ క‌లిసి పోటీ చేశాయి. ప‌వ‌న్ కల్యాణ్ వారికి మద్దతుగా నిలిచాడు. కానీ అసెంబ్లీ ఉప ఎన్నికలు గానీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికీ మ‌ద్ద‌తు ప్రకటించలేదు. అయినా సరే టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోరాడి 67 సీట్ల‌ు సాధించింది. వారిలో 23 మంది పార్టీ మారారు. ఉన్న వారిలోను అటు ఇటు అంటున్నారు. ఫలితంగా ఆ పార్టీ ఇరకాటంలో ఉంది. బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అని ఇంకా తేలలేదు. ప‌వ‌న్ కల్యాణ్ వారితో పోటీ చేస్తాడా లేక ఒంట‌రిగా వెళతాడా అనేది ఇంకా తేలలేదు. కొన్ని విషయాల్లో పవన్ కల్యాణ్ తన చేతగాని తనాన్ని చూపిస్తున్నాడు. ఏపీకి వచ్చి చంద్రబాబు పాలన బాగుందన్నాడు. తెలంగాణకు వెళ్లి కేసీఆర్ స్మార్ట్ సి.ఎం అన్నాడు. ఫలితంగా అతను నిజం చెబుతున్నాడా.. లేక వారికి బాకా ఊదుతున్నాడా అనే సందేహం వస్తోంది.
తాజా స‌ర్వేల‌ను బ‌ట్టి చూస్తే జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు అంతంత మాత్రమే. ఇక చిరంజీవి ప్ర‌జారాజ్యం గతంలో 16 శాతం ఓట్లతో 18 సీట్ల‌ు గెలుచుకుంది. అందులో రెండు తెలంగాణ‌, 16 సీట్లు ఏపీలోనివే. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేయగా.. సొంతూరులో ఓటమి రుచి చూపించారు అక్కడి జనాలు. మెుగల్తూరులో బడికి స్థలం ఇవ్వమన్నా ఒప్పుకోకుండా అమ్మేశారనే అపవాదును ఎప్పటి నుంచో మోస్తున్నాడాయన. ఫలితంగా అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప‌వ‌న్ జ‌న‌సేన.. ప్ర‌జారాజ్యంకు వ‌చ్చిన ఓట్ల క‌న్నా త‌క్కువుగా 10 శాతం ఓట్ల‌కే ప‌రిమితం కానుంద‌ట. తాజా సర్వేలు ఇదే చెబుతున్నాయి.

చిరంజీవికే సీన్ లేదు. ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ వల్ల ఏమవతుందని విజయశాంతి లాంటి వారు ముందే చెప్పేశారు. జ‌న‌సేన 10 శాతం ఓట్లు తెచ్చకుని, కేవ‌లం 9 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ట‌. జ‌న‌సేన ప్ర‌భావం ఏపీలోని గోదావ‌రి, కృష్ణా, విశాఖ జిల్లాల వ‌ర‌కే ఉంటుంద‌ని అంచనా. రాయల సీమ, ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో జ‌న‌సేన ప్రభావం కొద్ది మేర ఉంటుందని ఆ స‌ర్వే తేల్చింది. పవన్ కల్యాణ్ కు ఏం చేయాలో తెలియక పోవడం కొన్ని విషయాల్లో క్లారిటీ లేకపోవడంతో ఆయన్ను జనాలు నమ్మడం లేదని తెలుస్తోంది. కేసీఆర్ తాట తీస్తానని ప్రగల్భాలు పలికిన పవన్.. అతన్ని ఇంద్రుడు, చంద్రుడు అంటున్నారు. అదే పవన్ చేతగానితనాన్ని చెబుతుందంటున్నారు. అధికార పార్టీకి సలామ్ కొట్టే తత్వం వల్ల పవన్ నే కాదు.. జనసేన నేతలకు దిక్కుతోచని పరిస్థితి తలెత్తిందంటున్నారు. అందుకే ఓటింగ్ శాతం తగ్గుతుందనేది సర్వేలు చెబుతున్న మాట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *