Home > Crime > ఆబు సలేంకు జీవత ఖైదు

ఆబు సలేంకు జీవత ఖైదు

ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
వామ్మో... గాంధీ ఆస్పత్రి

mum-abusalem-apduniaముంబై పేలుళ్ల కేసులో దోషులకు టాడా కోర్టు నేడు శిక్షలు ఖరారు చేసింది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేమ్కు జీవిత ఖైదు శిక్ష పడింది. గుజరాత్ నుంచి ముంబయికి ఆయుధాలు రవాణా చేసిన ఆరోపణలతో అబు సలెంను అరెస్టు చేశారు. కాగా.. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు కూడా అబుసలెం ఆయుధాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి

ఇదే కేసులో టైగర్ మెమన్కు కూడా గతంలో టాడా కోర్టు జీవిత శిక్షను ఖరారు చేసింది. ముంబై పేలుళ్ల కేసులో తాహీర్ కీలక దోషి. ఆయుధ శిక్షణ కోసం అతను భారతీయ యువతను పాకిస్థాన్కు పంపించాడు.తాహీర్ కు పదేళ్ల  శిక్షను ఖరారు చేసింది. ఫిరోజ్ఖాన్ ఆయుధాల సరఫరా కోసం పోలీసులు, కస్టమ్స్ ఆఫీసర్లను ఒప్పించాడు ఫిరోజ్ఖాన్. పేలుళ్ల తర్వాత తాను తీసుకువచ్చిన ఆయుధాలను ధ్వంసం చేశాడు. రియాజ్ సిద్ధికీకి పదేళ్ల శిక్ష పడింది. అతనికి జీవిత ఖైదు వేయాలని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కోరారు. ఈ కేసు నమోదయిన నేపధ్యంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అబూసలేం, కరీముల్లా ఖాన్, టైగర్ మెమెన్ తదితరులు నిందితులు అయితే దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ పారిపోగా, అబూసలేం పోర్చుగల్ పారిపోయాడు. 

నిందితులపై 2007లో విచారణ ప్రారంభించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. ఆ తర్వాత 2012లో విచారణను పునరుద్ధరించారు. విచారణలో అబుసలెం సహా మరో ముగ్గురు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు యాకుబ్ మెమన్కు 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 
1993 మార్చి 12న ముంబయి నగరం వరుస బాంబులతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. రెండు గంటల వ్యవధిలో 12 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. 257 మంది మృతి చెందగా 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. 47 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *