Home > Crime > ఖమ్మంలో ప్రేమోన్మాదం

ఖమ్మంలో ప్రేమోన్మాదం

తల్లిని తోసి చంపేసిన కోడుకు
కులభూషణ్ విడుదలకు మార్గాలు సుగమం

kammam-lovers-apduniaభద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని దమ్మపేట మండలం నెమిలిపేటలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది ఓ యువతిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పల్లవి అనే యువతి ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పని చేస్తోంది. ఈ క్రమంలో పల్లవిని ప్రేమిస్తున్నానంటూ.. గత కొంత కాలం నుంచి శ్రీనివాసరాజు అనే యువకుడు ఆమెను వేధిస్తున్నాడు. అయితే ఇటీవలే పల్లవికి వివాహం నిశ్చయం కావడంతో ప్రేమోన్మాది శ్రీనివాస్.. పల్లవిపై కక్ష పెంచుకున్నాడు. ఇవాళ పల్లవి పని చేస్తున్న ప్రభుత్వ పాఠశాలకు వచ్చి ఆమెపై దాడి చేశాడు. పాఠశాల ఆవరణలోనే ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. దీంతో విద్యా వాలంటీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం శ్రీనివాసరాజు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ టీచర్ హత్యకు గురవడాన్ని చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. పల్లవి రక్తపు మడుగులో పడిపోయింది. పల్లవి తల్లిదండ్రుల రోదన ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com