Home > Vanitha > Recipes > దివాళి స్పెషల్ : మలై లడ్డు

దివాళి స్పెషల్ : మలై లడ్డు

అందమైన లిప్స్ కోసం సింపుల్ లిప్ కేర్ టిప్ ..!
మష్రూమ్ పకోడా...

mali-laddu-apduniaకావలసిన పదార్థాలు :

  • మైదాపిండి: 1/2kg
  • నెయ్యి: 400grm
  • పంచదార పొడి: 1kg
  • జీడిపప్పు: 1/4kg
  • హార్లిక్స్: 200grm
  • అమూల్ స్ప్రే: 800grm
  • జాజికాయ, జాపత్రి: 5grm
  • యాలకుల పొడి: 10grms
  • కిస్‌మిస్: 50grms
  • పిస్తాపప్పు: 100
  • బాదంపప్పు: 100grms

తయారుచేసే విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో మైదాపిండి వేసి సన్నటి మంటపై వేయించాలి. మైదా వేగిందో లేదో తెలియాలంటే ఒక నీటి చుక్క మైదాపిండిపై వేయాలి. అది పొంగితే మైదాపిండి వేగిందని అర్థం. ఇలా వేగిన మైదాను ఒక గిన్నెలోకి తీసి చల్లార్చాలి.
2. తర్వాత పూర్తిగా చల్లారాక అందులో అమూల్ స్ప్రే, హార్లిక్స్, పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఒకవేళ పిండి బాగా మెత్తగా ఉంటే పంచదార పొడి మరికొంత వేసుకోవచ్చు.
3. తర్వాత జీడిపప్పు, పిస్తాపప్పు, బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసి నేతిలో వేయించి ఈ పిండిలో వేయాలి. కిస్‌మిస్, యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి కూడా చేర్చి నెమ్మదిగా కలపాలి.
4. ఇలా తయారైన లడ్డు పిండి కాసేపు ఆరాక అరచేతికి నెయ్యిగాని నూనెగాని రాసుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే మలై లడ్డు రెడీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *