Home > Politics > చిన్నారెడ్డిపై దాడిని ఖండించిన మల్లు రవి

చిన్నారెడ్డిపై దాడిని ఖండించిన మల్లు రవి

రెండేళ్లలో ప్రతిఇంటికి కుళాయి నీళ్లు : మంత్రి లోకేష్
కోమటి బ్రదర్స్....కిం కర్తవ్యం

mallu-ravi-apduniaఎమ్మెల్యే చిన్నారెడ్డి పై టిఆర్ఎస్ గుండాల దాడి హేయమైన చర్య అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. చిన్నారెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాల్సిన పోలీస్ లు చిన్నారెడ్డినే అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. పోలీసు లు చట్టానికి లోబడి పనిచేయాలి కానీ .. అధికార పార్టీ నేతల వత్తిడికి తలొగ్గి పని చేయడం సరికాదని అన్నారు. చిన్నారెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.యధా రాజా తధా ప్రజా అనట్లు .. కేసీఆర్ మాట్లాడుతున్న మాటలతోనే .. దాడులు జరుగుతున్నాయని మల్లు ఆరోపంచారు.

రైతు సమితుల టిఆర్ఎస్ కమిటీల మాదిరిగా మారాయి. నోడల్ ఆఫీసర్లకు సంబంధం లేకుండా కమిటీల నియామకాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ స్థానిక ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి .. టిఆర్ఎస్ నేతలు నామినేట్ చేసిన వారితో సమన్వయ కమిటీలు వేయడం ఏంటని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేను కూడా విన్నాను దానిపై పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడుతానని అన్నారు. కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో 70 స్థానాలు రావడం ఖాయం. కాంగ్రెస్ లో భేదాభిప్రాయాలు లేవని నేను చెప్పలేనన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. గుత్తా ఓటమి ఖాయమన్నారు. ఆయనపై కాంగ్రెస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *