Home > Love Life > పురుషులకు ఇక గర్భం…

పురుషులకు ఇక గర్భం…

మహిళలతో జరజాగ్రత్త గురూ.. శృంగారమే జీవితం కాదు..
యావరేజ్ గా ఉంటేనే బెటర్ అంటున్న అమ్మాయిలు

men-pragnant-apduniaమహిళలతో సమానంగా మగాళ్లు కూడా గర్భం దాల్చవచ్చా? అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, అమెరికాకు చెందిన సంతానోత్పత్తి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. పిల్లల్ని కనడం కోసం మహిళలకు ప్రత్యేకంగా అవయవ నిర్మాణం ఉంటుంది. అయితే, పురుషులు కూడా లింగ మార్పిడి తరహాలో.. గర్భాసయ మార్పిడి ప్రక్రియ ద్వారా పిల్లలను కనవచ్చని అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రీప్రొడక్టివ్‌ మెడిసిన్‌ అధ్యక్షుడు రిచర్డ్‌ పాల్సన్‌ ధీమాగా చెబుతున్నారు. లింగమార్పిడి ప్రక్రియతో స్త్రీలుగా మారిన పురుషులు.. గర్భం దాల్చేందుకు అనువుగా అవయవ మార్పులు చేపడుతున్నారు.లింగ మార్పిడి తర్వాత పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని పాల్సన్ తెలిపారు. పురుషులు, మహిళల మధ్య పొత్తి కడుపు నిర్మాణంలో వ్యత్యాసం ఉంటుందన్నారు. పురుషుల్లో కడుపు నిర్మాణం మాత్రం భిన్నంగా ఉంటుందని, వారు గర్భం దాల్చినట్లయితే సిజేరియన్ తప్పనిసరి అని అన్నారు.‘గర్భంలో పిండం ఎదుగుదలకు స్త్రీలలో హార్మోన్లు సహజంగానే విడుదలవుతాయి.పురుషులకు మాత్రమే ఆ అవకాశం లేదు. ఇందుకు ప్రత్యేకంగా హర్మోన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి’’ అని తెలిపారు. పురుషులు సైతం మహిళల్లా గర్భం దాల్చి పండండి బిడ్డకు జన్మనిచ్చే రోజులు మరెంతో దూరంలో లేవని ఆయన స్పష్టం చేశారు.మగాళ్లు గర్భం దాల్చవచ్చని.. అరిజోనాకు చెందిన థామస్ బీటై ఇప్పటికే నిరూపించాడు. ఆయన అధికారికంగా లింగ మార్పిడి శాస్త్రచికిత్స జరిపించుకుని, గర్భం దాల్చాడు. ప్రపంచంలో తొలిసారి గర్భం దాల్చిన పురుషుడిగా రికార్డులకెక్కాడు. అయితే, ఈ సారి లింగ మార్పిడి అవసరం లేకుండానే గర్భాశయ మార్పిడితో పురుషులు గర్భం దాల్చవచ్చని పాల్సన్‌ చెబుతున్నారు.

నుదుటిపై తిలకధారణను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. శివ భక్తులు విభూది, విష్ణుభక్తులు చందనం, దేవీ భక్తులు సిందూరం బొట్టుగా పెట్టుకుంటారు. హిందూ సంప్రదాయంలో ఇది సర్వసాధారణం. అయితే నుదిటి మీద కనుబొమల మధ్య ఉంగరపు వేలుతోనే చాలా మంది తిలకం దిద్దుకుంటారు. కేవలం ఉంగరపు వేలితోనే కాకుండా మిగతా వేళ్లతో తిలకం ధరిస్తే ఏమవుతుంది.హిందూ పురాణాల ప్రకారం మధ్య వేలు శని స్థానం. ఈయన జీవితానికి భద్రత కలిగిస్తాడు. కాబట్టి మధ్యవేలితో నుదుటిపై తిలకం ధరిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది.ఉంగరపు వేలు సూర్య స్థానం. అందుకే ఈ వేలుతో నుదుటన బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి. అంతేకాదు సూర్యుడి తేజస్సు, శక్తి కలుగుతాయి. అలాగే ఉంగరపు వేలుతో తిలకధారణ చేస్తే నుదుటిపై ఉండే ఆఙ్ఞా చక్రం ఉత్తేజితమై, మనిషి మేధస్సును మేల్కొల్పడానికి సహాయపడుతుంది. అందుకే దేవుడికి ఈ వేలుతోనే తిలకధారణ చేస్తారు.పురాణాల ప్రకారం బొటన వేలు శుక్ర స్థానం. ఈ గ్రహం ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కాబట్టి బొటనవేలుతో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి.చూపుడు వేలు బృహస్పతి స్థానం. మరణించిన వారికి మాత్రం ఈ వేలుతో తిలకం దిద్దితే మోక్షం ప్రాప్తిస్తుంది. అమరత్వాన్ని కలిగించేది బృహస్పతి గ్రహం. అందుకే మిగతా సందర్భాల్లో చూపుడువేలుతో నుదుటిపై బొట్టు పెట్టడాన్ని అపవిత్రంగా భావిస్తారు.మానవ శరీరంలోని మొత్తం 13 ప్రదేశాల్లో తిలకధారణ చేయవచ్చు. కానీ నుదుటిపై బొట్టుపెట్టుకోవడమే అత్యంత పవిత్రంగా భావిస్తారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మేష రాశికి అధిపతి అంగారకుడు లేదా కుజుడు. దీన్ని అరుణ గ్రహం అంటారు. ఈ రాశి వాళ్లు సిందూరాన్ని నుదుటిపై ధరించడం శుభంగా భావిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com