Home > Sports > క్రీడలకు ప్రోత్సాహం : మంత్రి అనంద్ బాబు

క్రీడలకు ప్రోత్సాహం : మంత్రి అనంద్ బాబు

ఫిడే ప్రపంచ లోగో పై విమర్శల వెల్లువ
అనుష్క తో విరాట్ కు ముహర్తం కుదిరినట్టే

anand-babu-apduniaప్రతిభ ఉండే క్రీడా కారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం నాడు సీనియర్ మెన్ అంతర్ జిల్లా 8 వ హాకి చాంపియన్ షిప్ పోటీలను అయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తాఫ, ఇన్ చార్జి మద్దలి గిరిధర్, చందు సాంబశివరావు,, హాకీ క్రీడాకారులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు 13 జిల్లాలనుంచి వచ్చిన హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఉన్న బిఆర్ స్టేడియం ను అంతర్జాతీయ స్టేడియం గా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం అన్ని క్రీడకారులకు ప్రోత్సాహకాలు, బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగిలిన క్రీడాలకంటే హాకీ క్రీడా చాలా ఉన్నతమైనది. రాష్ట్రానికి చెందిన హాకీ క్రీడాకారులు నేషనల్ హాకీ క్రీడాలకు ఎంపిక అయ్యి అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రాఖ్యాతలు తీసుకుని రావాలని కోరారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లతో క్రీడా స్టేడియంల ను అభివృద్ధి చేయ్యడం జరుగుతుందని మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com