Home > Politics > ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు

చిరంజీవి కోసం పార్టీల గాలం
గవర్నర్ ను కలిసిన విపక్ష నేతలు

harish-rao-apduniaముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టాన ఐఎమ్ఏ హాల్ నిర్వహించిన బుధవారం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సిద్దిపేటలో ఆన్ మోల్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆన్ లైన్ ఆప్లికేషన్ యాప్ ను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. నార్మల్ డెలివరీలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏఎన్ఎం, అంగన్ వాదీలదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రెండున్నర రెట్లు ప్రసవాలు పెరిగాయన్నారు. సిద్ధిపేట ఆసుపత్రిలో జులై నెలలో 503 ఆగస్టు నెలలో 483 ప్రసవాలు జరిగాయని వివరించారు. దుబ్బాక నియోజక వర్గ పరిధిలోని దుబ్బాక, తిమ్మాపూర్ ఇతర పీహెచ్ సీల్లో కూడా ఎక్కువగా ప్రసవాలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు.

కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలా అత్యధికంగా ప్రసవాలు పెరగడం ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రులపై పెరిగిన నమ్మకం, విశ్వాసం అని ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ మార్పుకు నిదర్శనంగా పేద వర్గాలకు కేసీఆర్ కిట్ ఒక వరమైనదని చెప్పవచ్చని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ దొరకని పరిస్థితి ఉండేదని., కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకు రావడంతో ఆరోగ్య వ్యవస్థ ఎంతగానో బలోపేతమైనదని మంత్రి వివరించారు.

నార్మల్ డెలివరీలు చేయిస్తే నజరానా..
వంద శాతం నార్మల్ డెలివరీ-ప్రసవాలు చేయిస్తే వారిని నగదు పారితోషికంతో అభినందనలు తెలుపుతామని మంత్రి హరీశ్ రావు నజరానా ప్రకటించారు. ఇమ్యూనైజేషన్ విషయం, వంద శాతం ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసిన వారిని గుర్తించి వారికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున సన్మానం చేస్తామని మంత్రి చెప్పారు. ఇందులో ప్రతి నియోజక వర్గానికి ఒక్కరు చొప్పునన ఒక్కొక్కరికీ రూ.10 వేలు నగదు పారితోషికం అందించి సన్మానం చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 27 జిల్లాలో పర్యటించాను. అన్ని జిల్లాలో కన్నా సిద్ధిపేట జిల్లా వైద్య ఆరోగ్య రంగంలో ముందంజలో ఉన్నదని, ఇక్కడి వైద్య బృందం, నర్సులు, ఏఎన్ఎం లు.. చాలా కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు. ఆన్ మోల్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆప్లికేషన్ యాప్ ను రాష్ట్రంలోనే మొదటగా సిద్దిపేటలో ప్రారంభిస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *