Home > Politics > నదుల అనుసంధానంతో కరువు దూరం : మంత్రి లోకేశ్

నదుల అనుసంధానంతో కరువు దూరం : మంత్రి లోకేశ్

మోడీపై డిగ్గీరాజా ట్వీట్స్
ఉపాధ్యాయుడు ఆదర్శంగా వుండాలి : కడియం శ్రీహరి

lokesh-apdunia2019 ఎన్నికల్లో ప్రతిపక్షం అడ్రస్‌ గల్లంతు అవుతుందని, రాష్ర్టంలోని 175 స్థానాలను టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విజయవాడ భవానీపురంలోని వాటర్‌ వర్క్స్ దగ్గర జలసిరికి జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌ 2019లోగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరవును పారద్రోలుతామని అన్నారు. నీరు లేకుంటే అభివృద్ధి కష్టమని చంద్రబాబు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంత్రి తెలిపారు. పులివెందులలో రూ. 10 కోట్ల పనులు చేశాం.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *