Home > World News > అమెరికా పర్యటనలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ

అమెరికా పర్యటనలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ

యూసఫ్ షా అంతర్జాతీయ ఉగ్రవాదే
చైనాలో కొండ చరియల కింద గ్రామం
us modi_apduniaభారతదేశం తనను తాను రక్షించుకోగలదని చెప్పేందుకు సర్జికల్ దాడులే ప్రబల సాక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భద్రత కోసం వేరొకరిపై ఆధారపడాల్సిన పనిలేదని.. అవసరమైతే మనదేశం తన కాళ్లపై తాను నిలబడగలదని ఈ దాడులు రుజువుచేశాయన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. వాషింగ్టన్ డీసీ వేదికగా భారతీయులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. భారత సైనికుల పరాక్రమాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా మాటువేసిన ఉగ్రవాద శిబిరాలను గతేడాది సర్జికల్ దాడులతో మట్టుబెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలన్న సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. సర్జికల్ దాడులపై ఒక్క దేశం కూడా భారత్‌ను ప్రశ్నించలేదన్నారు. ‘‘20 యేళ్ల క్రితం తీవ్రవాదం గురించి భారతదేశం మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు అర్థంచేసుకోలేదు. అది శాంతి భద్రతల సమస్య మాత్రమేనంటూ చాలాదేశాలు కొట్టిపడేశాయి. ఇప్పుడు తీవ్రవాదం ఎలా ఉంటుందో వాళ్లకు ఉగ్రవాదులే చెప్పేశారు…’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాంతిని కోరుకునే దేశంగా, చట్టాలను గౌరవిస్తూనే… అవసరమైనప్పుడు గట్టిగా ప్రతిఘటించేందుకు కూడా వెనకాడబోమన్నారు. మొత్తంగా ఈ ప్రసంగంతో… సరిహద్దు వద్ద మాటి మాటికీ కవ్విస్తున్న పాకిస్తాన్‌కు, దానికి వంతపాడుతున్న చైనాకు ప్రధాని మోదీ పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
 
 
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *