Home > World News > National > ధోలా సదియాపై మోడీ హల్ చల్

ధోలా సదియాపై మోడీ హల్ చల్

అమేజాన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఏమి కనిపిస్తుందో తెలుసా?
పేద్ద.... బ్రిడ్జిను ప్రారంభించిన మోడీ

PM MODI_apduniaదేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా ప్రసిద్ధిగాంచిన ‘ధోలా సదియా’ వారధిని జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘వంతెనల్లో బాహుబలి’గా అభివర్ణిస్తోన్న ధోలా- సదియా వారధిని.. అసోం, అరుణాచాల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ, బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన లోహిత నదిపై 9.15 కిలోమీటర్ల పొడవున నిర్మించారు.కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంలోనే ప్రధాని మోదీ ఈ భారీ వంతెనను ప్రారంభించడం గమనార్హం. వంతెనను ప్రారంభించిన అనంతరం దానిపై మొదటిగా ప్రధాని కాన్వాయ్‌ ప్రయాణించింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత కాన్వాయ్‌ని ఆపేయించిన మోదీ.. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఒంటరిగా వంతెనపై నడిచారు. దాదాపు 200 మీటర్ల దూరం సింగిల్‌గా నడిచివెళ్లిన ఆయన.. వంతెనపై అటు,ఇటు కలియతిరుగుతూ హల్‌చల్‌ చేశారు. ఆ తర్వాత సోనోవాల్‌, గడ్కరీలను దగ్గరికి పిలిచి వారితో సంభాషించారు. అలా పదినిమిషాల పాటు వంతెనపై గడిపిన మోదీ.. బహిరంగ సభలో పాల్గొనేందుకు ధోనీ వైపునకు కదిలారు. అసోంలోని దిబ్రూఘర్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి కారులో టిన్‌సుకియా జిల్లా పురానా సదియా వద్దకు చేరుకున్నారు. వంతెన ప్రారంభోత్సవం నిమిత్తం ఏర్పాటుచేసిన శిలాఫలాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని.. అనంతరం రిబ్బన్‌ కట్‌చేసి వంతెనను జాతికి అంకితం చేశారు. ‘వంతెనల్లో బాహుబలి’గా పేరుగాంచిన ‘ధోలా-సదియా’వారధి నిర్మాణంలో తెలుగువారి ప్రమేయం ఉండటం విశేషం. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించిందించి మరెవరోకాదు, హైదరాబాద్‌, వైజాగ్‌లు ప్రధాన కేంద్రాలుగా పనిచేసే ప్రఖ్యాత నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌! దీని వ్యవస్థాపకులు తెలుగువారేకావడం, గోదావరి నదిపైనా ఈ సంస్థ పలు వంతెనలు నిర్మించడం తెలిసిందే. యూపీఏ సర్కార్‌ హయాంలో(2011లో) శంకుస్థాపన జరుపుకున్న ‘ధోలా-సదియా’ వంతెన నిర్మాణానికి ఆరేళ్ల సమయం పట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ బ్రిడ్జిని కట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *