Home > Editorial > ఆచరణలోకి రాని మోడీ పథకాలు

ఆచరణలోకి రాని మోడీ పథకాలు

స్వదేశానికి ప్రధాని
ప్రకృతి విలయతాండవంతో తీరని నష్టం

narendramodi-apduniaనరేంద్రమోడీ తలపెట్టిన ప్రయోగాలు, ప్రవేశపెట్టిన పథకాలు వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడంతో పాటు తనను అందలమెక్కించిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేవే. పైకిమాత్రం తీపిగుళికల్లా అవి ప్రజలను ఆకర్షిస్తాయి. కొత్త గారడీ విద్యల్ని ప్రదర్శిస్తే జనాల సమీకరణ, మద్దతు లభిస్తుందని ఆయనకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు.
దేశంలో పాలన రాజకీయ నాయకుల చేతుల్లోంచి వ్యాపార, ధనిక వర్గాల చేతుల్లోకి ఎప్పుడో పోయింది. ఇప్పుడు మాత్రం ఆ వర్గాల జీ హుజూర్ల పాలన పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చింది.మోడీని ఒక రూలర్‌గా కాక ప్రమోటర్‌గా భావించాలి. పక్షం రోజులుగా హైదరాబాద్‌లో ఒక నగల వ్యాపారి తానే స్వయంగా తమ ఉత్పత్తుల గురించి పత్రికల్లో, టీవీల్లో, సినిమా తెరలపై ప్రచారం చేస్తూ కనబడుతున్నాడు. స్వయంగా యజమాని చెబితే ప్రజలు నమ్ముతారనే భావన అయి ఉండవచ్చు. మన ప్రధాని సైతం అన్ని పథకాలకు తానే పాత్రధారి, సూత్రధారిగా కనబడుతారు. పథకం జనంలోకి వదిలినాక దాని ఫలితాలు మరోరకంగా ఉంటే ఆయన స్థానంలో మరొకరు వచ్చి సర్దుబాటు జవాబులు చెబుతారు.పాలనాపగ్గాలు చేతికి వచ్చిన రెండు నెలల్లోనే ప్రధాని మోడీ జన్‌ధన్ యోజన పథకం ప్రకటించారు. ఇది ఇదివరకే గత ప్రభుత్వాలు చేపట్టిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కు మరో రూపం. అయితే బ్యాంకర్లను ఉరుకులు పరుగులు పెట్టించి 23.8.2014 నాడు ఒకే రోజు కోటిన్నర బ్యాంకు ఖాతా లు తెరిపించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. వారం రోజుల వ్యవధిలో కోటి 81లక్షల ఖాతా లకు ఆ లెక్క ఎగబాకింది. బ్యాంకుల సెలవు దినాలు, పనివేళలు పక్కనబెట్టించి ఆ వారం రోజులు వారితో గొడ్డు చాకిరి చేయించారు.ప్రస్తుతం జన్‌ధన్ యోజన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలనాటికి 29.48 కోట్ల ఖాతాలు తెరవ బడి వాటిలో రూ. 65,698 కోట్లు జమ అయ్యాయి. ఇది రికార్డు కోసం చెప్పుకోవడమే కాని ఆ యోజనలో ప్రకటించిన ఆకర్షణల వల్ల ఇదివరకే ఖాతాలున్నవాళ్లు జన్‌ధన్ ఖాతాలు కూడాతెరిచారు.బలహీన పడుతున్న బ్యాంకింగ్ వ్యవస్థను జనధనంతో నిలబెట్టే ప్రయత్నమిది. ఇక పథకంలో ఉన్న ఆకర్షణల్లో బీమా, ఓవర్ డ్రాఫ్ట్ వసతి ముఖ్యమైనవి.ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత లక్ష రూపాయల ప్రమాద బీమా, రూ.30,000/జీవితబీమా వర్తిస్తుంది. అయితే ఈ సౌకర్యం పొందడానికి90రోజులలోపు ఖాతాలో లావాదేవీలు జరిపి ఉండాలి. ఖాతాలో మూడు నెలల కాలంలో డబ్బు వేయడమో, తీయడమో లేకుంటే బీమా వర్తించదు. అంటే చేతిలో డబ్బు ఎంతో కొంత ఉండవలసిందే. అంతేకాకుండా 18 ఏళ్లు దాటి 60 ఏండ్ల లోపు ఉన్నవాళ్లే అర్హులు, మరే ఇతర బీమాలో సభ్యుడై ఉంటే ఈ సౌకర్యం లభించదు.

జన్‌ధన్ యోజనకు ప్రధాన ఆకర్షణ రూ.5,000/ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యమే. ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత రూ.5000/రుణసౌకర్యం లభిస్తుందని ప్రచారం విరివిగా జరిగి ఆ ఖాతాలకోసం జనం బారులు తీరారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం బ్యాంకు వారికి వదిలిపెట్టింది. బ్యాంకులు తమ నియమ నిబంధనల కొలబద్దలు తీసి అతి కొద్దిమందికి ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాయి. ఈ వసతి బ్యాంకుల పాత ఖాతాదారు లకు, అన్ని రకాల యోగ్యతలున్నవారికీ దొరికింది. 29 కోట్ల ఖాతాల్లో ఎన్నింటికి ఓవర్ డ్రాఫ్ట్ దొరికిందన్న సమాచారం ఎక్కడా లేదు. గాని వారిలో 7లక్షల మందికి రుణసౌకర్యం కల్పించినట్లు ఎస్‌బిఐ ప్రకటించింది, అయితే అదే బ్యాంకు జన్‌ధన్‌యోజన ద్వారా తెరిచిన ఖాతాల సంఖ్య పదికోట్లుపైనే. ఇందులో 7 లక్షలమందికి మాత్రం బ్యాంకులోను దొరకడం, ఉండీ లేని కిందికే లెక్క. 15.8.2014 నాడు జన్‌ధన్‌యోజన ప్రకటించినట్లే అదే సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రధాని మోడి స్వచ్ఛ్ భారత్‌ను ఆవిష్కరించారు. సినిమా నటులు, క్రీడాకారులు దేశాన్ని ఊడ్చినట్లే ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ మూడేళ్లలో దేశం ఎంత స్వచ్ఛమైందో చెప్పనవసరం లేదు గాని 0.5% పన్ను మాత్రం స్వచ్ఛత కోసం విధింపబడింది. అయిదేళ్లలో దేశాన్ని శుభ్రం చేయ సంకల్పించిన ప్రధాని 2016లో ఆ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపక్రమించారు. దేశంలో 54% జనాభాకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. గత ప్రభుత్వంలో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణ పథకానికి బడ్జెట్‌లో ఈసారి రూ.9000కోట్లు కేటాయించి అదే స్వచ్ఛ భారత్‌గా ప్రచారం సాగించారు. ఇప్పటివరకు 3.5కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగినా వాటిలో 60% దొడ్లకు నీటి సౌకర్యం కల్పించక పోవడంతో అవి నిరుప యోగంగా ఉన్నాయి. రూ.12,000తో నిర్మించే ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి లబ్ధిదారు తన భాగంగా రూ.3,000/కలుపవలసి ఉంటుంది. స్వచ్ఛభారత్ కోసం భారతప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో రూ.9617 కోట్ల సహాయ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గత 6నెలలుగా దాని అభివృద్ధి నివేదిక పంపించక పోవడం వల్ల ప్రపంచ బ్యాంకు నిధుల సరఫరా ఆపివేసింది.మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు దేశాన్ని కుదిపింది. 8 నవంబర్ 2016 నాడు రాత్రి 8 గంటలకు ఈ పథకాన్ని ప్రకటించి దేశపౌరులను ప్రధాని నివ్వెర పరచారు. నల్లధనం కట్టడికి, దొంగనోట్ల ముద్రణకి దివ్య ఔషధంగా ప్రకటించి నెలలపాటు ప్రజలను పలు ఇక్కట్లపాలు చేశారు.ఈ మధ్య రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించిన నోట్ల రద్దు ఫలితం వివరాలవల్ల ప్రభుత్వం విమర్శల పాలైంది. ప్రధాని మోడీ నోరు విప్పక పోగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రద్దు లక్షంలో మరెన్నో ప్రయోజనాలు న్నాయని సర్దుబాటుగా మాట్లాడారు. రద్దయ్యే నాటికి చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. ఇప్పటివరకు బ్యాంకులో జమ అయిన నోట్లు 15.28లక్షల కోట్లు. వెనుకకు రాని నోట్లు విలువ కేవలం 16,050 కోట్లు మాత్రమే. అనగా 99% నోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లే, నల్లధనం నోట్ల రూపంలో ఉన్నది 3% మాత్రమేనని ఆర్థిక నిపుణులు మొత్తుకున్నా సర్కారు పెడచెవిన పెట్టింది. ప్రజాప్రయో జనం కన్నా రాజకీయ లబ్ది వైపే ప్రభుత్వం మొగ్గిందని స్పష్ట మౌతుంది.జులై ఒకటవ తేదీనుండి దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించిన వస్తు, సేవలపై పన్ను నరేంద్ర మోడీ మరో ప్రయోగంలో భాగమే. 2011లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో జియస్‌టి ప్రవేశ పెడితే తమ రాష్ట్రానికి ఏడాదికి రూ.14,000కోట్ల పన్ను తగ్గుతుందని చెప్పి దానిని వ్యతిరేకించారు. ఇప్పుడు ఏ రాష్ట్రాలూ నోరు విప్పే పరిస్థితిలో లేవు.జియస్‌టి 5% నుంచి 28% వరకు వివిధ వస్తువు లకు వర్తిస్తుంది. అయితే 20% దాటి ఈ పన్ను ఏ దేశం లోనూ లేదు. బట్టలపై, ఫ్లోరింగ్ రాళ్లపై పన్ను తగ్గించ మని సమ్మెలు చేసినా ఫలితం దక్కలేదు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం ఈ పన్ను వల్ల మోయలేని భార మవుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంత మొత్తుకున్నా ఫలించడం లేదు. కండోమ్స్‌పై 0% ఉంది. ఆడువారు వాడే సానిటరీ నాప్‌కిన్స్‌పై 18% పన్ను వేయడం విమర్శలకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *