Home > General > పేద్ద…. బ్రిడ్జిను ప్రారంభించిన మోడీ

పేద్ద…. బ్రిడ్జిను ప్రారంభించిన మోడీ

నీళ్లివరు కానీ నిధులు కాజేస్తారు
ఆ దున్నపోతులు చాలా కాస్ట్లీ గురూ..!
 
bridge2_apduniaదేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిని  ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. చైనా సరిహద్దులకి సమీపంలో అస్సాంలో బ్రహ్మాపుత్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 9.15 కి.మీ. ధోలా – సదియా బ్రిడ్జిగా పేరున్న ఈ వంతెన నిర్మాణం 2011లో  మొదలైంది. ధోలా-సాదియా వంతెన నిర్మాణానికి దశాబ్దం కిందట అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. అయితే పనులు నత్తనడకన సాగడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2014లో మోదీ పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడంతో మూడేండ్లలోనే పనులు పూర్తయ్యాయి. ఈ వంతెన ప్రారంభమైతే అసోంలోని రుపాయ్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెకా/రోయింగ్ ప్రాంతాల మధ్య దూరం 165 కిలోమీటర్లు తగ్గనున్నది. ప్రయాణ సమయం 5 గంటలు కలిసిరానున్నది. దీంతో రోజుకు రూ.10 లక్షల మేర 
ఇంధనం ఆదా కానున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,056 కోట్లు. ఇప్పటివరకు బ్రహ్మపుత్రనదిని దాటాలంటే పగటిపూట మాత్రమే పడవల్లో వెళ్లాల్సి వచ్చేదని, వరదల సమయంలో నదిని దాటడం అసాధ్యమయ్యేదని, ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయి వంతెన ప్రారంభమైతే అసోం, తూర్పు అరుణాచల్‌ప్రదేశ్ మధ్య 24 గంటల రవాణా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.60 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకర్‌‌ని తట్టుకుని నిలబడగలిగే శక్తిసామర్థ్యాలు కలిగిన ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకి రాకపోకలు సాగించడానికి మార్గం సుగుమం అవడంతోపాటు ఈశాన్య ప్రాంతంలో మిలిటరీ కార్యక్రమాల విస్తరణకి వీలు కల్పించనుంది. అస్సాం రాజధాని దిస్పూర్‌కి 540 కి.మీ, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కి 300 కి.మీ దూరంలో వున్న ఈ బ్రిడ్జి.. వాయుమార్గం పరంగా చైనాకి 
100 కి.మీ లోపే వుంటుంది. అస్సాంలో బ్రహ్మాపుత్రా నదిపై తేజ్‌పూర్‌కి సమీపంలో కలియంబోరా వద్ద నిర్మించిన బ్రిడ్జి తర్వాత మరో 375 కి.మీ వరకు ఎక్కడా ఇంకో బ్రిడ్జి లేనే లేదు. కలియంబోరా తర్వాత ధోలా వద్ద నిర్మించిన ఈ బ్రిడ్జినే రెండోది కావడం విశేషం. ముంబైలో బాంద్రా-వర్లిని కలిపే 3.55 కి.మీ పొడవైన సీ లింక్ కన్నా అధిక పొడవైన ఈ బ్రిడ్జి దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా గుర్తింపు పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *