Home > Movies > కుశ మూవీపై భారీ అంచనాలు

కుశ మూవీపై భారీ అంచనాలు

ఫుట్ బాల్ లీగ్ లో సన్నీ, రానా
ప్రిన్స్ ఆడియోకు భారీ ఏర్పాట్లు

jr-ntr-lava-kusa-apdunia‘జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధను దోచేస్తా’ అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కుశ’ అవతారంలో. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘జై లవకుశ’.మూవీలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించనుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ.. ‘జై లవకుశ’ మూవీ నుండి ఒకే టీజర్ కాకుండా ఎన్టీఆర్ మూడు పాత్రలకు సంబంధించి మూడు టీజర్‌‌లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘జై, లవ’ టీజర్స్‌ విడుదలవగా.. తాజాగా శుక్రవారం ఉదయం ‘కుశ’ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.‘జై’ టీజర్‌లో అసుర .. అసుర.. అసుర.. అసుర.. అంటూ ఎన్టీఆర్ రావణుడిగా ఉగ్రరూపంలో ద.. ద.. ద.. దడ పుట్టిస్తూ.. ఆ రావణుడ్ని చంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా.. ఉందా…’ అంటూ ‘జై’ టీజర్‌‌తో దమ్ముచూపించాడు. ఆ తరువాత ‘లవ’ కుమర్‌గా సాఫ్ట్‌లుక్‌‌తో దర్శనం ఇచ్చిన ఎన్టీఆర్ తాజాగా ‘కుశ’ టీజర్‌లో నవ్వులు పూయిస్తున్నాడు.ఆధార్ కార్డ్‌కి గ్రీన్ కార్డ్ తేడాతెలియనంద అమాయకంగా కనిపిస్తూనే… ‘నాకు కొట్టేయడమే కాదు కొట్టడం కూడా వచ్చు’ అంటూ విలన్స్ దుమ్ముదులుపేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్‌లు ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తుండగా.. బాలీవుడ్‌ నటుడు రోనిత్ రాయ్ ఈ మూవీలో విలన్‌ నటించడం మరో విశేషం. ‘జై లవకుశ’సెప్టెంబర్ 21న భారీ అంచనాలతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *