Home > Bhakti > తిరుమలలో స్వామి వారికి భారీగా ఆదాయం

తిరుమలలో స్వామి వారికి భారీగా ఆదాయం

తిరుమలలో తగ్గుతున్న నీళ్లు
ఆలయాలకు కార్తీక శోభ

tirumala-hundi-apduniaపెద్దనోట్ల రద్దుతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరముల వెంకన్న మరింత కాసుల వర్షంతో మునిగి తేలుతున్నాడు. చిల్లర డబ్బుల కొరతతో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ హుండీ ఆదాయం మాత్రం అధికంగా ఉంటోంది. కేవలం ఐదు రోజుల్లోనే హుండీ ద్వారా రూ.15.05 కోట్ల ఆదాయం లభించింది. సాధారణంగా శ్రీవారి హుండీ ఆదాయం రోజుకు సగటున రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు ఉంటుంది. అదే రద్దీ రోజుల్లో అయితే రూ.3 కోట్ల వరకు వస్తుంది. కానీ ప్రస్తుతం సీన రివర్స్‌ అయింది. పెద్ద నోట్లు రద్దయిన నేపథ్యంలో చాలా మంది వాటిని హుండీలో వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చినప్పటి నుంచి.. చిన్న నోట్ల సమస్యతో దూరప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు రావడంలేదు. దీంతో కొండ ఖాళీగా ఉంటోంది. కేవలం రెండు గంటల్లోనే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కానీ హుండీ ఆదాయం లెక్కలు చూస్తుంటే ముక్కుపై వేలేసుకోవాల్సి వస్తోంది. పరకామణి లెక్కింపుల్లో అన్నీ పెద్ద నోట్లే కనిపిస్తున్నాయి. మరో కొద్ది రోజులు ఇదే స్థాయిలో హుండీ ఆదాయం పెరుగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు తిరుమలలో అదనపు అన్నదాన కౌంటర్లను మరికొన్ని రోజులు కొనసాగించాలని అధికారులకు టీటీడీ ఈవో సాంబశివరావు సూచించారు. రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దు నేపథ్యంలో తిరుమలలోని పీఏసీ-1,2, సీఆర్వో వద్ద తాత్కాలికంగా అన్నప్రసాద వితరణ, చంటిపిల్లలకు పాలు సరఫరా చేసేలా అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ చిల్లర కష్టాలు తీరకపోవడంతో ఆ కేంద్రాలను కొనసాగించాలని ఈవో ఆదేశించారు. తిరుమలలో పరిస్థితిపై ఆయన సమీక్షించారు. భక్తులు దర్శనం, వసతి తదితర సౌకర్యాలు సులువుగా పొందేందుకు వీలుగా ఆధార్‌ లేదా ఏదైనా ఇతర గుర్తింపు కార్డును తీసుకొచ్చినా ఆమోదించాలని ఉత్తర్వులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *