Home > World News > కొరకరాని కొయ్యగా కిమ్ జాంగ్

కొరకరాని కొయ్యగా కిమ్ జాంగ్

మెక్సికోలో భారీ భూకంపం
31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

kim-jong-un-apduniaఅమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌ను హత్య చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. కిమ్‌ను అంతం చేయడానికి దక్షిణకొరియాలో పక్కా ప్రణాళికలు రూపొందుతున్నాయి. కిమ్‌ను రాత్రివేళల్లో హతమార్చడానికి ఓ ప్రత్యేక దళాన్ని దక్షిణకొరియా తయారు చేయనుందనే ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే మరో వార్త సంచలనంగా మారింది. అతడిని సులువుగా చంపే ఆయుధాన్ని దక్షిణకొరియా అభివృద్ధి చేసింది. కేవలం 15 నిమిషాల్లోనే కిమ్‌ను హత్య చేసేందుకు అడ్వాన్స్‌డ్ ఎయిర్‌-లాంచ్‌డ్ క్రూజ్ మిసైల్‌ను దక్షిణకొరియా మిలిటరీ పరీక్షించింది.మిసైల్‌ను జర్మనీకి చెందిన తారుస్ సిస్టమ్స్ రూపొందించిందని, ఇది అత్యధికంగా 500 కి.మీ. దూరం ప్రయాణించగలదని దక్షిణకొరియా రక్షణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. దీన్ని రాడార్ వ్యవస్థలు కూడా గుర్తించలేవని, లక్ష్యంవైపు వేగంగా దూసుకెళుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఉత్తరకొరియా అణుపరీక్షలు జరుపుతున్న ప్రాంతాలపై కేవలం 15 నిమిషాల్లో దాడి చేసే అవకాశం ఉందని, కిమ్‌ను కూడా అంతే సమయంలో మట్టుబెట్టవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. ఇటీవల ఉత్తరకొరియా జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్షల అనంతరం దక్షిణకొరియా చురుకుగా వ్యవహరిస్తూ ఆయుధాలకు పరీక్షిస్తోంది. అమెరికా సలహాల మేరకు తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇదే నిజమైతే కిమ్‌కు ముప్పు తప్పదు. ఎందుకంటే ఆయన తరుచూ అణు స్థావరాలను సందర్శిస్తారు. ఒకవేళ ఈ మిసైల్ ప్రయోగించే సమయంలో ఆ ప్రదేశంలో ఉంటే ప్రమాదమే.ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను అంతమొందిచడానికి స్పార్టాన్ 3000 పేరుతో ఓ ప్రత్యేక దళాన్ని తయారు చేస్తుందని వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఆ దిశగా దక్షిణ కొరియా ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుదని సెప్టెంబరు 4 న ఆ దేశ రక్షణ మంత్రి సాంగ్ యంగ్ మూ వెల్లడించినట్లు సమాచారం. స్పార్టాన్ దళం ఈ ఏడాది చివరి నాటికి సిద్ధంగా ఉంటుంది. ఈ దళ సభ్యులు రాత్రివేళలో కిమ్ హత్యకు పథకం రచిస్తారట. ఈ వ్యూహానికి దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు బీజం వేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com