Home > Politics > ఎంపీ రామ్మోహన్ రిసెప్షన్కు ఏర్పాట్లు..

ఎంపీ రామ్మోహన్ రిసెప్షన్కు ఏర్పాట్లు..

నంద్యాల టిడిపి అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డి
అఖిలమ్మ కొంచెం తగ్గమ్మా...!

ram-mohan-naidu_apduniaనిమ్మాడలో పండగ వాతావరణం నెలకొంది. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వానికి వన్నె తెచ్చిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వివాహ రిసెప్షన్కు సిద్ధమైంది. ఎంపీ రామ్మోహన్నాయుడు వివాహం 14న విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 18న ఆది వారం తన స్వగ్రామమైన నిమ్మాడలో కనీ వినీ ఎరుగని రీతిలో రిసెప్షన్ను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ పక్క వాతావరణం సహకరించకపోయినా శరవేగం గా వందలాదిమంది టెక్నీషియన్స్, కూలీలు రిసెప్షన్ ఏర్పాట్లు చేయిస్తున్నారు. నిమ్మాడ ఎఫ్సీఐ గోదాములకు సమీపంలోని 20 ఎకరాల స్థలంలో రిసెప్షన్ ఏర్పాటుకు నిర్ణయించారు. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒంగోలు జిల్లా అద్దంకికి చెందిన డెకరేషన్ బృందం పది రోజులుగా భారీషెడ్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
 ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా కాశీబుగ్గ డీఎస్పీ సీహెచ్.వివేకానంద ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఉంచేందుకు జాతీయ రహదారి పక్కన, గ్రానైట్
ఫ్యాక్టరీకి ఎదురుగా సిద్ధం చేస్తున్నారు. నిమ్మాడ గ్రామం మొత్తం విద్యుద్దీపాల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 17న నిమ్మాడలో సాయంత్రం రామ్మోహన్నాయుడుకి గుర్రం బగ్గీపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో మిరుమిట్లు గొలిపే బాణా సంచా కాల్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
కింజరాపు రామ్మోహన్నాయుడు పెళ్లి అనంతరం నిమ్మాడలో జరుగుతున్న విందు కార్యక్రమానికి ధవళేశ్వరం నుంచి ప్రత్యేక వంట సిబ్బందిని సుకువచ్చారు. మొత్తం భోజనంలో 15 రకాల వంట కాలు అందించే దిశగా చర్యలు తీసుకుం టున్నారు. వీటిలో తాపేశ్వరం ఖాజాలు, చక్రపొంగళి, పనసకాయ బిర్యానీతో పాటు నాలుగు రకాల కూరలతో పాటు జిల్లాలో ప్రాముఖ్యమైన గూనచారు కూడా వండిస్తున్నారు. ప్రతి ఒక్కరికి విందు అందేలా కౌంటర్లను సిద్ధం చేశారు. వెనీలా ఐస్క్రీం, కార్న్ సమోసా వం టివి కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విందు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *