Home > Politics > మనవరాళ్లతో కొడుకు కోసం ములాయం రాయబేరాలు

మనవరాళ్లతో కొడుకు కోసం ములాయం రాయబేరాలు

తమిళనాడులో జయ మేనకోడలి ఫ్లెక్సీల మంట
పవన్ రాజకీయాలపై చిరు ఏమన్నారంటే

mulayam-singh-yadav-apduniaసమాజ్‌ వాదీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ నివాసాల మధ్య అడ్డుగోడలను పెంచితే, ములాయం మనవరాళ్లు, అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తెలు అదితి (15), టీనా (10) లతో రాయబేరాలు ప్రారంభించారు. వాస్తవానికి చిన్నప్పటి నుంచి వీరిద్దరూ తండ్రి కన్నా, తాత వద్దే అధికంగా ఉంటూ వచ్చారు. దీంతో పార్టీలో గొడవలు రెండు ఇళ్ల మధ్యా వీరి రాకపోకలకు ఎంతమాత్రం అడ్డుగా నిలవలేకపోయాయి. వీరిద్దరూ సునాయాసంగా తమ తాతయ్యను కలిసేందుకు వెళ్లి వస్తున్నారు. ఇక కొడుకుతో రాయబారాలకు, మాటలు కలిపేందుకు ములాయం వీరిని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన మనవరాలు టీనాతో ఆడుకుంటూ, మీ నాన్న చాలా మొండోడు అని ములాయం వ్యాఖ్యానించగా, ఆ పాప, ఇంటికి వచ్చి తాతయ్య చెప్పింది చెప్పినట్టు తండ్రికి చేర్చింది. దీన్ని విన్న అఖిలేష్‌ సైతం నవ్వుతూ అవును, నేను మొండి వాడినే అన్నట్టు తెలిసింది. యూపీలో మరో నెలరోజుల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, సాధ్యమైనంత త్వరగా తండ్రీ, కొడుకుల మధ్య విభేదాలు సమసిపోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇక, తమ పార్టీకి అఖిలేష్‌ యాదవే ముఖ్యమంత్రని ములాయం స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఎలక్షన్‌ కమిషన్‌ను కలసి తిరిగి లక్నో వస్తున్న వేళ, ములాయంకు స్వాగతం పలకాలని నిర్ణయించుకున్న అఖిలేష్‌, అదే విమానంలో అమర్‌ సింగ్‌ ఉన్నారని తెలుసుకుని ఆ ప్రయత్నానాన్ని విరమించారు. ఆ విమానంలో అమర్‌ సింగ్‌ లేకుంటే, తండ్రీ కొడుకులు ఈపాటికే కలసిపోయి ఉండేవారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో చెలరేగిన విభేదాల కారణంగా ఆ పార్టీ నేతలు రోజుకో ట్విస్ట్‌ ఇస్తున్నారు. ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ నిన్న తమ పార్టీ గెలిస్తే అఖిలేషే ముఖ్యమంత్రి అని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ములాయం మనవరాళ్లు, అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తెలు అదితి, టీనాలతో రాయబారం జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అనూహ్యంగా ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో వారిద్దరి మధ్య రాజీ జరగనుందని, ఇదో కీలక రాజకీయ పరిణామం అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *