Home > Crime > నల్గోండ మునిసిపల్ చైర్ పర్సన్ భర్త దారుణ హత్య

నల్గోండ మునిసిపల్ చైర్ పర్సన్ భర్త దారుణ హత్య

వామ్మో...బోండా మహా ముదురు
వదలని పాతకేసులు

srinivas-murder-apduniaనల్గొండలో దారుణం జరిగింది. మున్సిపల్ ఛైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. నల్గొండలో ఆయన ఇంటి ఎదురువీధిలోనే అయన హత్యకు గురయ్యారు.బుధవారం రాత్రి శ్రీనివాస్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అయన బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియన వ్యక్తులు హత్య చేశారు. శ్రీనివాస్ ను అత్యంత కిరాతకంగా బండరాళ్లతో మోది చంపేశారు.విసయం తెలిసిన వెంటనే ఘటనాస్థలిని నల్గొండ ఎస్పీ పరిశీలించారు. శ్రీనివాస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. అనుచరులే ఈ హత్యకు పాల్పడి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులుగా అనుమానిస్తున్న వ్యక్తులు పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం.

శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి, తనకు తీరని లోటు అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అన్నారు. శ్రీనివాస్ హత్య విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న కోమటిరెడ్డి, శ్రీనివాస్ కుటుంబసభ్యులను ఓదార్చారు. శ్రీనివాస్ మృతదేహాన్ని చూసిన వెంటనే కోమటిరెడ్డి బోరున విలపించారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీనివాస్ను చంపుతామని గతంలో పలుమార్లు బెదిరింపులు వచ్చాయని, గతంలో బెదిరించి శ్రీనివాస్ ను పార్టీ మార్పించారని గుర్తు చేశారు. శ్రీనివాస హత్యకు సంతాప సూచకంగా కోమటిరెడ్డి జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.

శ్రీనివాస్ హత్యను టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. హత్య విషయం తెలియగానే అయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ప్రజాస్వామ్యంలో హత్య రాజకీయాలు అమానుషం.. ఇది రాజకీయ కక్షలతో కూడిన హత్యగానే భావిస్తున్నామని ఉత్తమ్ అన్నారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే శ్రీనివాస్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే తగిన విధంగా బదులు ఇస్తాము.. హత్యపై పోలీసులు నిష్పక్ష పాతంగా విచారణ జరిపి దశులను కఠినంగా శిక్షించాలని ఉత్తమ్ డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *