Home > World News > ట్రంప్ పై మండిపడుతున్న ముస్లిమ్ దేశాలు

ట్రంప్ పై మండిపడుతున్న ముస్లిమ్ దేశాలు

భాగ్యనగర్ ను గుర్తు చేసుకుంటున్న ఇవాంక
ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో దినకరన్

donaldtrum-apduniaఐదు ముస్లిం దేశాల పై ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు జెరూసలెం విషయం తీసుకున్న నిర్ణయం రచ్చ చేస్తోంది. ఇజ్రాయెల్‌ రాజధానిగా టెల్‌ అవీవ్‌ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. టెల్‌ అవీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించనుంది అమెరికా. అసలే ఇజ్రాయెల్‌, పాలస్తీనాలు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అంతర్మథనంతో లక్షలాది మంది చనిపోయారు. అది చాలదన్నట్లుగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. బుష్, క్లింటన్, ఒబామా చేయలేని పనిని ట్రంప్ చేసినట్లు అయింది. ఎన్నికల హామీల్లో ఒకటి నెరవేర్చినట్లు ట్రంప్ చెబుతున్నాడు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం పై పలు అరబ్‌ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం జెరూసలెం. ఇజ్రాయెల్‌ ప్రజలు యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కలసి జీవించే దేశాన్ని నిర్మించారు. ఇజ్రాయెల్‌–పాలస్తీనా… ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు కూడా అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ చెప్పిన తీరు హాట్ టాపికైంది. సౌదీ రాజు సల్మాన్, ఈజిప్ట్‌ అధ్యక్షుడు అల్‌ సిసీలు ట్రంప్‌ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ముస్లింల మనోభావాలను ట్రంప్‌ చర్య రెచ్చగొడుతుందని వారు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదంపైనా ఇది ప్రభావం చూపనుంది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ, పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌లతోపాటు జోర్డాన్, సౌదీ, ఈజిప్టు అధినేతలతోనూ ముందే ట్రంప్ మాట్లాడారు. వారు సరే అన్నాకనే ట్రంప్ ప్రకటన చేశారు. క్రిస్టియన్లు, ఆర్మేనియన్లు ఓ ప్రాంతంలో, ముస్లింలు మరో ప్రాంతంలో, యూదులు ఇంకో చోట ఉంటారు. మొత్తంగా ట్రంప్ నిర్ణయంతో ఆయా దేశాల్లో వ్యతిరేకత పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com