Home > Editorial > కాలానికి అనుగుణంగా అందరూ మారాలి

కాలానికి అనుగుణంగా అందరూ మారాలి

తమిళ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్
అన్నింటికి ఆధారమేనా......

triple-talq-apduniaముస్లిం మహిళల హక్కులకు, ఆత్మగౌరవానికి భంగకరంగా ఉన్న తలాఖ్ విధానం చాలా కాలంగా వివాదాస్పదంగా మారింది. ముస్లింలలోని ఆధునికత సంతరించుకున్నవారు ఈ తలాఖ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ మతంలోనైనా అభివృద్ధి చెందినవారు పాతకాలపు అమానవీయ చట్టాలను వ్యతిరేకించడం సహజం. ప్రతిమతంలోనూ స్వీకరించదగిన అంశాలతోపాటు తిరస్కరించదగినవీ ఉంటాయి. కాలం మారే కొద్దీ కొన్ని సం ప్రదాయాలను వదిలివేయక తప్పదు. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది.. అసలు కేసులో కల్పించుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని, అయితే, దీని తీవ్రత దృష్ట్యా, తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాధికారాన్ని పార్లమెంటుకే వదిలేస్తున్నామని తెలిపింది. ట్రిపుల్ తలాక్‌పై సుదీర్ఘ వాదనలనంతరం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మూడుసార్లు తలాక్ ఉచ్చరించి విడాకులు తీసుకోవడం చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే, దీనిపై పార్లమెంట్‌లో ఓ చట్టాన్ని తీసుకురావాలని, అంతవరకూ తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ, ఇంజక్షన్ ఆర్డర్ జారీచేసింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేంత వరకూ తమ ఆదేశాలు అమలులో ఉంటాయని పేర్కొందిపలువురు ముస్లిం మహిళలు ఈ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వివిధ హక్కుల సంఘాలు కూడా తలాఖ్ విధానాన్ని సవాలు చేశాయి. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ఇది ముస్లిం మత ఆంతరంగిక అంశమని అభిప్రాయపడుతున్నది. మతపరమైన సున్నితమైన అంశమైనప్పటికీ, మహిళల హక్కులకు సంబంధించినది కావడం వల్ల ఈ విధానం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఖురాన్‌లో, షరియత్‌లో తలాఖ్ విధానం లేదు. మహమ్మద్ ప్రవక్త కూడా విడాకులకు మానవీయమైన, ప్రజాస్వామిక విధానాన్ని సూచించారు. అయితే కొన్ని వందల ఏండ్లుగా అమలులో ఉన్నదనే కారణంగా తలాఖ్ ను ముస్లిం మత విధానాలలో భాగంగా గుర్తించాలనే వాదన ముందుకువచ్చింది.

తలాఖ్‌లో మూడు రకాల విధానాలు ఉన్నాయి. ఇందులో బిద్దత్ విధానం ప్రకారం అప్పటికప్పుడే మూడుసా ర్లు తలాఖ్ చెప్పి విడాకులు పొందడం. ఈ విధా నం ఆవేశంలో, తాగిన మైకంలో తలాఖ్ చెప్పినా చెల్లుబాటు కావడం మొదలైంది. ఫోన్, ఈ- మెయి ల్, వాట్సాప్ మొదలైన పద్ధతుల్లో కూడా మూడుసార్లు తలాఖ్ చెప్పి భార్యను వదిలి పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మిగతా రెండు తలాఖ్ పద్ధతులకు భిన్నంగా తలాఖ్ బిద్దత్ ద్వారా విడాకులు పొందితే మళ్ళా అదే వ్యక్తితో కాపురానికి వీలులేదు. ఆ మహిళ మరో వ్యక్తిని వివాహమాడి, కాపురం చేసి విడాకులు తీసుకుంటే కానీ పాత భర్త ను వివాహం
చేసుకోవడం సాధ్యం కాదు. ఈ తలా ఖ్ బిద్దత్ మహిళలకు క్షోభనిస్తున్నది. వారి ఆత్మగౌరవానికి భంగకరంగా మారింది. అందువల్ల మహిళల హక్కుల పరిరక్షణకు న్యాయపోరాటం ఉధృతమైంది. సుప్రీంకోర్టు ముందుకు బహుభార్యత్వం వంటి ఇతర అంశాలు వచ్చినప్పటికీ, ఈ మూడవ రకం తలాఖ్‌ఫైనే దృష్టి సారించింది.తలాఖ్‌ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రాజకీయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పును సమానత్వం, మానవ హక్కుల కోణంలో చూడాలే తప్ప మతపరమైన దృక్కోణంలో వ్యాఖ్యానించడం సబబు కాదు. ముస్లింలలోని ఆధునికత సంతరించుకున్నవారు ఈ తలాఖ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ మతంలోనైనా అభివృద్ధి చెందినవారు పాతకాలపు అమానవీయ చట్టాలను వ్యతిరేకించడం సహజం. ప్రతిమతంలోనూ స్వీకరించదగిన అంశాలతోపాటు తిరస్కరించదగినవీ ఉంటాయి. కాలం మారే కొద్దీ కొన్ని సం ప్రదాయాలను వదిలివేయక తప్పదు. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది. ఉదారవాద ప్రజాస్వా మ్య సంస్కృతిలో భాగంగా మతపరమైన అంశాలలో జోక్యం చేసుకోకూడదని స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో దేశ నాయకులు భావించారు. ఆంతరంగిక అంశాలలోకి రాజ్యం చొరబడుతుందని, తద్వారా తమ విశ్వాసాలకు భంగం కలుగుతుందని భిన్న మతాలవారిలో భయాందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచింది. ఆధునిక సంస్కృతి సమాజంలో విస్తరించింది. ఇప్పుడు లౌకిక విషయాలలో మతం పాత్ర ఉండకూడదనే భావన సమాజంలో బలపడ్డది.

అందువల్ల ఆయా మతాలలోని లౌకిక, అభ్యుదయవాద శక్తులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వానికి, ప్రాథమిక హక్కులకు భంగం కలిగే సూత్రాలు, ఆచారాలు ఏ మతంలో ఉన్నా చెల్లవనే స్పష్టమైన వైఖరి పార్లమెంటు, న్యాయస్థానం తీసుకోవాలి. తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమైందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకిక వ్యవస్థ బలోపేతానికి బాటవేయాలి.తలాఖ్‌ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రాజకీయ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ తీర్పును సమానత్వం, మానవ హక్కుల కోణంలో చూడాలే తప్ప మతపరమైన దృక్కోణంలో వ్యాఖ్యానించడం సబబు కాదు. ముస్లిం సమాజంతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పిచ్చింది.ట్రిపుల్ తలాక్‌పై ఆరు నెలల పాటు స్టే విధిస్తున్నామని, ఈలోగా చట్ట సవరణ చేసి, ట్రిపుల్ తలాక్ చెల్లకుండా పార్లమెంటులో కొత్త చట్టాన్ని తేవాలని కోరింది. మూడు సార్లు తలాక్ చెప్పి భార్యను వదిలించుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్యగా ధర్మాసనం అభివర్ణించింది. ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల్లో తలాక్ చెప్పడం చట్ట సమ్మతం కాదని, అలాంటివి చెల్లుబాటుకావని పేర్కొంది. కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లాబోర్డు అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *