Home > General > కడప నుండి మైసూర్, చెన్నైకి సర్వీసులు

కడప నుండి మైసూర్, చెన్నైకి సర్వీసులు

మూడీస్ తో మార్పు వస్తుందా
సింగరేణి టాప్

kadapa-airport-apduniaకడప నగరంలో ఇప్పుడు విమానాల సందడి కనిపిస్తోంది. కడప నుంచి హైదరాబాద్‌, చెన్నై, మైసూరుకు సర్వీసులు ఉండటంతో అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనల నేపథ్యంలో ట్రూజెట్ ప్రారంభ ఆఫర్ ధరను మూడు నెలల పాటు పొడగించారు.కడప నుంచి విమాన సర్వీసుల మాటేగాని ఎప్పుడు నడుపుతారో ఎప్పుడు ఎత్తేస్తారోనని అనుకోనెవారు. కానీ ఇప్పుడు ట్రూజట్ విమానయాన సంస్థ హైదరాబాదుతో పాటు చెన్నై, మైసూరుకు కూడా సర్వీసులను రెగ్యులర్ గా నడుపుతోంది. దీంతో కడప ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 699 రుపాయలకే ఆఫర్ ధరతో ట్రూజట్ విమానయాన సంస్థ కడప ప్రజలకు మరింత చేరువైంది. విద్యార్థులకు హాస్పిటల్ కు వెళ్లేవారికి ఈ సర్వీసులు చాలా ఉపయుక్తంగా ఉండటం.. ప్రయాణ చార్జీ కూడా సరసమైన ధరలో ఉండటంతో బాగా డిమాండ్ ఏర్పడింది. కడప వాసులు విమాన సర్వీసులపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడున్న సర్వీసులతో పాటు ఏపీ రాజధానికి, విశాఖపట్నం కు సర్వీసులు నడిపితే ఇంకా ప్రయోజనం ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. అంతేకాక కడప విమానాశ్రయం నుంచి కడప నగరానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com