Home > Politics > అన్ని గ్రామాల్లో ఎల్ ఈడీ దీపాలు : మంత్రి లోకేష్

అన్ని గ్రామాల్లో ఎల్ ఈడీ దీపాలు : మంత్రి లోకేష్

మళ్లీ లోకేష్ తడబడ్డాడు
అమలుకు నోచుకోని హామీలు

naralokesh-apduniaవిజయనగరం జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్‌ అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస రాజన్నకాలనీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్‌ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విడతలవారీగా అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పర్యటనలో భాగంగా జిల్లాలోని ఎస్ కోట నియోజకవర్గంలో బహిరంగ మల మూత్ర విసర్జన రహిత జమ్మాదేవిపేట గ్రామాన్ని సందర్శించారు. అక్కడ స్థానికులతో ముచ్చటించారు. పె న్షన్లు ,డ్వాక్రా రుణాలు,మరుగుదొడ్ల నిర్మాణం,ఎల్ఈడి లైట్లు,సి.సి రోడ్లు తదితర కార్యక్రమాలు అమలు అవుతున్న తీరు గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకు్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న పెన్షన్లు,24 విద్యుత్,డ్వాక్రా రుణ మాఫీ,రైతు రుణమాఫీ చేస్తున్నామని లోకేష్ అన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకు లోటు లేకుండా ముఖ్యమంత్రి ప్రజలకు లోటు లేకుండా పరిపాలన అందిస్తున్నారని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రతి పక్ష పార్టీ మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మూడు నెలల్లోనే విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు అమరుస్తాం.గ్రామాల్లో మిగిలి ఉన్న సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. నూటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం చెయ్యడం తో పాటు వాటిని వినియోగిస్తున్న జమ్మా దేవి పేట గ్రామస్తులను అయన అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *